హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విలీనానికి ఓకే.. మా వల్లే: ఆసక్తిగా హరీష్, గాదె చర్చ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gade Venkat Reddy-Harish Rao
హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెసులో విలీనం చేసేందుకు తాము సిద్ధమని ఆ పార్టీ సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు చెప్పగా.. తెలంగాణలో ఆ వాదం బలంగా ఉందని కాంగ్రెసు పార్టీ నేతలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డిలు చెప్పిన ఆసక్తికర సంఘటన గురువారం చోటు చేసుకుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఆదాల అధ్యక్షతన ప్రభుత్వ రంగ సంస్థలపై సభా కమిటీ సమావేశమైంది. ఇందులో సభ్యుడైన హరీష్ రావు వచ్చే సమయానికి సమావేశం ముగియడంతో... హరీష్ అధ్యక్షుడు ఆదాలను కలిసేందుకు సిఎల్పీ కార్యాలయానికి వెళ్లారు.

అక్కడ వారి మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. సిఎల్పీ కార్యాలయానికి వచ్చిన హరీష్‌ను వారు సాదరంగా ఆహ్వానించారు. అంతలో హరీష్ మాట్లాడుతూ.. త్వరలో తెలంగాణ వస్తుందని, కానీ గాదె వెంకట రెడ్డి మాత్రం సమైక్యవాదిగా అడ్డుపడుతున్నారని, ఆయన ఎస్ అంటే అంతా సవ్యంగా ఉంటుందన్నారు. అందుకు గాదె.. తాను సమైక్యవాదినేనని, అందులో సందేహం లేదని, కానీ కేంద్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తెలంగాణ వస్తుందని విశ్వసించడం లేదని, యూపిఏ భాగస్వాములు ఓకే అంటేనే తెలంగాణ సాధ్యమని, అయినా తన అభిప్రాయం తనదని, మీ నమ్మకం మీదని, దానిని ఎవరూ ఎవరినీ కాదనలేరన్నారు.

అందుకు హరీష్.. ప్రత్యేక రాష్ట్ర కాంక్ష పల్లెపల్లెకూ విస్తరించిందని, తెలంగాణ వస్తుందన్న విశ్వాసం మాకుందని, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో తెరాసను విలీనం చేస్తామని, లేదంటే రెండు నెలలు వేచి చూస్తామని, ఆ తర్వాత తమ యాక్షన్ ప్లాన్ తమకుందని చెప్పగా... ఇదంతా తమకు తెలియదని, 2014 వరకూ రాదని మేం నమ్ముతున్నామని కావూరి అన్నారు. రావడం ఖాయమని తాము భావిస్తున్నామని మళ్లీ హరీష్ చెప్పారు.

గాదె వెంకట రెడ్డి అన్ని ట్లో స్పష్టంగా ఉంటారని, 610 ఉత్తర్వు తదితరాలపై అవగాహనతో మాట్లాడతారని హరీష్ కితాబిచ్చారు. అందుకు గాదె.. ఎవరి అభిప్రాయాలు వారివని, కానీ ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడడం తగదని హరీష్‌కు సూచించారు. తాము విద్వేషాలు రగిల్చేలా మాట్లాడడం లేదని హరీష్ చెప్పగా... పత్రికలు చూస్తే తెలుస్తుందని గాదె, ఆదాల అన్నారు. వాదం ఇప్పుడు బలంగా ఉందని, హైదరాబాద్ కూడా మాదేనని హరీష్ చెప్పగా... అందుకు కారణం మా వాళ్లేనని గాదె అన్నారు. డిసెంబర్ 9న ప్రకటన రాకుంటే ఈ రోజు పరిస్థితి వేరేగా ఉండేదని అభిప్రాయపడ్డారు. అది వచ్చాక ప్రత్యేక రాష్ట్ర కాంక్ష పెరిగిందని చెప్పారు.

English summary
TRS MLA Harish Rao told to former minister Gade Venkat Reddy that they are ready to merge TRS if Congress announce Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X