హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొన్ని ఛానళ్లు అలా చెప్తున్నాయి: టివి9పై శోభానాగి రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shobha Nagi Reddy
హైదరాబాద్: తమ పార్టీ బందును విఫలం చేయడంపై చూపినంత శ్రద్ధ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పాలనపై చూపి ఉంటే ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కావని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి శుక్రవారం అన్నారు. తమ పార్టీ ఇచ్చిన బందు విజయవంతమైందన్నారు. బందుకు సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కృష్ణదాసుపై పోలీసులు ప్రవర్తన సరిగా లేదని ఆమె ఆరోపించారు.

దీనిపై ప్రివిలైజ్ కమిటీకి లేఖ రాస్తామన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారమయ్యేంత వరకు తాము పోరాటం చేస్తామన్నారు. విద్యుత్ సమస్యలపై తమ పార్టీ చేస్తున్న పోరాటం రాజకీయ ప్రయోజనాల కోసమని ఇతర పార్టీలు అనడం సరికాదన్నారు. సమస్య తీరే వరకు తాము ఉద్యమిస్తామన్నారు. కరెంట్ సమస్య లేదని ప్రజల ముందుకొచ్చి కాంగ్రెసు నాయకులు చెప్పగలరా అని ఆమె సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై వామపక్షాలతో కలిసి పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

వామపక్షాలు చేసే పోరాటాలకు తాము సంఘీభావం తెలుపుతామన్నారు. బందులో ప్రజలు స్వచ్చంధంగా పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తమ పార్టీ వారు ప్రశాంతంగా ధర్నాలు, ర్యాలీలు చేస్తుంటే పోలీసులు అరెస్టు చేశారని మండిపడ్డారు. కరెంటు కోతలతో జగన్ విసిగిపోయారు కాబట్టే బందు విజయవంతమైందన్నారు. ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈ బందును నిర్వహించిందని చెప్పారు.

తమ పార్టీ బందు విజయవంతమైనా కొన్ని ఛానళ్లు పని గట్టుకొని దుష్ర్పచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో బంద్ జరగలేదని టివి 9వంటి ఛానళ్లు ప్రత్యేక బులెటిన్స్ ప్రసారం చేశాయన్నారు. నాడు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేపట్టినప్పుడు కూడా ఇలాగే కొన్ని ఛానళ్లు వ్యతిరేక కథనాలు ప్రసారం చేశాయన్నారు. తమ పార్టీపై ఇలాంటి ఉద్దేశ్య పూర్వక కథనాలు మానుకోవాలని ఆమె సూచించారు.

English summary
YSR Congress party Allagadda MLA Sobha Nagi Reddy said on Friday that bandh is success. Many people from state were participated in Bandh, which is called by YSR Congress, said Sobha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X