హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్తుత్తిదే: మోత్కుపల్లి, దొంగలకు సిఎం కాపలా: గాలి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, అశోక్ గజపతి రాజు శుక్రవారం పార్టీ శాసనసభా పక్ష సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెసు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వారన్నారు. మంత్రి ధర్మానది ఉత్తుత్తి రాజీనామా అని మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. మంత్రులు జైళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తాము రాజీనామా చేయాల్సి వస్తుందనే భయంతో కళంకిత మంత్రులు ధర్మాన ప్రసాదరావు రాజీనామా ఆమోదించకుండా అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. రైతులు పంటలపై పెట్టుబడులు పెట్టి విద్యుత్తు లేక అల్లాడిపోతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలంటే పోలీసు స్టేషన్లో ఇవ్వాల్సి వస్తుందని ఆయన అన్నారు. రైతులకు గంటల పాటు విద్యుత్తు ఇవ్వలేకపోతే ఎన్ని నిమిషాలు ఇస్తారో చెప్పాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు లేక చిన్నపిల్లలు చనిపోతున్నారని ఆయన అన్నారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో బీసీ విద్యార్థులకు సీలింగ్ పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వ తీరు వల్ల బీసీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యులకు గవర్నర్ నరసింహన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. సమస్యలపై చర్చకు వెంటనే శాసనసభను సమావేశపరచాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలపై చర్చిద్దామంటే ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని ఆయన అన్నారు.

సచివాలయంలో నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుకు తన ప్రాణాలు పోయి ఉండేవని, కాలో చేయో విరిగి ఉండేదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. దేవుడే తనను కాపాడాడని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దొంగలకు కాపలా కాస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్తుపై ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన అన్నారు. సచివాలయంలో ధర్నా చేయడం నేరం కాదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పుడైనా ఎక్కడైనా ఆందోలన చేయవచ్చునని ఆయన అన్నారు.

English summary
Telugudesam leaders lashed out at CM Kiran Kumar Reddy. Mothkupalli Narasimhulu, Gali Muddukrishnama Naidu and P ashok Gajapathi Raju made allegations against Kiran Kumar Reddy on various issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X