కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు అప్పుడే కారు, జైలులో జగన్ విశ్రాంతి: వీరశివా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veera Siva Reddy
కడప: 2014 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ కొనసాగుతారని, మంత్రి సి.రామచంద్రయ్య తలకిందులైన రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ముఖ్యమంత్రి కాలేరని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి గురురవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ఉన్నతమైన నాయకుడని 2014 తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానానికి చెప్పి తాము చిరంజీవికి సపోర్టు చేస్తామన్నారు. అయితే రామచంద్రయ్య ముందే కూసిన కొయిలలాగ ఎరగక మాట్లాడుతున్నారన్నారు.

సి.రామచంద్రయ్యకు కొంత లూజ్ అని.. అందుకే చిరు ముఖ్యమంత్రి అవుతారని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కిరణ్ పదవికి వచ్చిన ముప్పేమీ లేదన్నారు. రామచంద్రయ్య చెప్పేవన్నీ కట్టు కథలే అన్నారు. బిసిలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మలది కపట ప్రేమ అన్నారు. నిజంగా బాబుకు, విజయమ్మకు బిసిలపై ఇంత మమకారం ఉంటే చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ సీటు, అలాగే పులివెందుల సీటు బిసిలకు కేటాయించాలన్నారు. ఎందుకంటే వీరిద్దరూ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైన నిలబడే సత్తా గలవారన్నారు.

చంద్రబాబు ఒక చంద్రగిరి స్థానంలో పోటీ చేయలేడని ఎద్దేవా చేశారు. వీరికి పార్టీ అధ్యక్ష పదవులు, ముఖ్యమంత్రి పదవులు కావాలి, బిసిలపై వీరికి అంతజాలి, కరుణ ఉంటే చంద్రబాబు, విజయమ్మలు పార్టీ అధ్యక్ష పదవులు బిసిలకు కట్టబెట్టి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం జైల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడని అతను విడుదలయ్యేంత వరకు విజయమ్మ బిసిలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు.

రాయలసీమకు చెందిన ఈ ఇద్దరు పార్టీ అధ్యక్షులు బిసిల అభ్యున్నతి, అభివృద్ధి కోరుకుంటున్న వారైతే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బిసిలకు ఒక్క సీటు కూడా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. బిసిల గురించి మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలన్నారు. కాలేజిలు, భూముల కబ్జాలు, తగాదా భూములు స్వాధీనం చేసుకొనే సంప్రదాయం వైకాపా నాయకులదేనని మామిళ్ళపల్లెలో ఏడున్నర ఎకరాల స్థలాన్ని దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి స్వాధీనం చేసుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు.

English summary
Congress MLA Veerasiva Reddy said on Thursday that YSR Congress party chief YS Jaganmohan Reddy is taking rest in jail. He said Chiranjeevi will no become CM tilla 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X