వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి సహా ములాయం ధర్నా: చల్లారని పార్లమెంటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mulayam Singh Yadav
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై తెలుగుదేశం పార్టీ సహా వామపక్షాలు, ఎస్పీ శుక్రవారం పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగాయి. దానికితోడు, పార్లమెంటులో బొగ్గు కుంభకోణంపై శుక్రవారం కూడా పార్లమెంటు ఉభయసభల్లో దుమారం చెలరేగింది. ఉభయసభలు నిరసనలతో అట్టుడికాయి. మొదట సభా కార్యక్రమాలు స్తంభించడంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

శుక్రవారం ఉదయం లోకసభ సమావేశం కాగానే విపక్ష సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకున్నాయి. బొగ్గు కుంభకోణంపై చర్చకు పట్టుబట్టాయి. బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహించి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రధాని నైతిక బాధ్యత వహించాలంటూ ఆందోళనకు దిగాయి. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. స్పీకర్ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ ప్రతిపక్షాల సభ్యులు వినలేదు. దీంతో స్పీకర్ మీరా కుమార్ లోకసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో ఇదే పరిస్థితి నెలకొంది.

తిరిగి సమావేశమైన తర్వాత కూడా లోకసభలో పరిస్థితి సద్దుమణగలేదు. బిజెపి సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకుని వెళ్లి నిరసన తెలిపారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ సభను సోమవారంనాటికి వాయిదా వేశారు. ఇదిలా వుంటే, కాగ్‌పై కాంగ్రెసు ఎదురుదాడికి దిగింది.

మరోవైపు, బొగ్గు కుంభకోణంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటు ఆవరణలో ప్రదర్శన నిర్వహించాయి. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, సమాజ్‌వాదీ పార్టీలు గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగాయి. బొగ్గు కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. బొగ్గు కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయని ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. అవినీతికి బాధ్యులైనలవారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గతవారం రోజుల నుచి పార్లమెంటు సమావేశాలను నిర్వహించడంలో విఫలమైన కాంగ్రెసును, సభలను అడ్డుకుంటున్న బిజెపి తీరును ఈ పార్టీలు తప్పు పట్టాయి.

English summary
Samajwadi party chief Mulayam Singh Yadav is all set to gang up against both the Congress and the BJP in the coal block allocation scandal that rocked the country recently. In a bid to showcase his political clout, he has joined hands with non-UPA and non-NDA members to carry out a dharna outside Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X