వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా ఎందుకు చేయాలి: బిజెపిపై మండిపడ్డ సింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
టెహ్రాన్: బొగ్గు కుంభకోణంపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నిత్యం సమావేశాలను స్తంభింప చేయడంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని బిజెపి నిత్యం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మన్మోహన్ స్పందించారు. ఆ పార్టీపై ఒకింత స్థాయిలో మండిపడ్డారు. బొగ్గు కేటాయింపుల విషయంలో పూర్తి బాధ్యత తనదేనని, అయితే ఈ కేటాయింపులలో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పారు.

ప్రతిపక్షాలకు తన మౌనమే సమాధానమని, తాను మాట్లాడనని, రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. తాను ఎందుకు రాజీనామా చేయాలని ఎదురు ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు బిజెపి యత్నిస్తోందని, అధికారం చేజిక్కించుకునేందుకే ఇలా చేస్తోందని విమర్శించారు. బిజెపి సాధారణ ఎన్నికల వరకు ఆగాలని ఎద్దేవా చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పారు.

అభివృద్ధి రేటుపై నీచ రాజకీయాల ప్రభావం పడుతోందని, అధికార దాహంతోనే బిజెపి పని చేస్తోందని విమర్శించారు. సమావేశాలను సక్రమంగా జరగనివ్వడం లేదన్నారు. ఈ కారణంగానే సెషన్స్ సరిగా జరగటం లేదన్నారు. అస్సాం అల్లర్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లర్ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్త దెబ్బ తిన్నదన్నారు.

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని తాను మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. లోక్‌పాల్ పరిధిలోకి ప్రధానమంత్రిని తీసుకు వచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. నామ్ సమావేశాలకు హాజరైన ప్రధాని మన్మోహన్ సింగ్ టెహ్రాన్‌లో బిజెపిపై ఎదురు దాడికి దిగారు.

English summary
Prime Minister Manmohan Singh on Friday hit back at the opposition for demanding that he step down over his alleged role in the coal blocks allocation issue. Speaking to reporters on board Air India One while returning from the NAM Summit in Tehran, the PM said the BJP was resorting to diversionary tactics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X