భారత స్విమ్మర్ 0.58 సెకన్ల తేడాతో ఫైనల్స్‌ మిస్

Posted By:
Subscribe to Oneindia Telugu
Sharath Gayakwad
లండన్: లండన్‌ మహా నగరం మరో అధ్బుతమైన క్రీడలకు తెరలేపింది. బుధవారం అర్దరాత్రి తర్వాత లండన్‌లో ఎలిజబెత్ రాణి పారాలింపిక్స్‌ను లాంఛనంగా ఆరంభించారు. ఆరంభోత్సవ కార్యక్రమంలో మూడు వేలకు పైగా వాలంటీర్లు, సంగీత, నృత్య ప్రదర్శనలతో పాటు గాల్లో విన్యాసాలతో అలరించారు. పారాలింపిక్స్ అంటే వికలాంగులకు సంబంధించినవి. వికలాంగ అథ్లెట్ల కోసం ఒలింపిక్స్ పూర్తైన తర్వాత నాలుగేళ్లకోసారి ఈ పారాలింపిక్స్ నిర్వహిస్తారు.

ప్రారంభోత్సవ సందర్బంగా ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకీంగ్ అథ్లెట్లలో స్పూర్తి నింపారు. మీ కాళ్లవైపు కాదు.. ఆకాశం వైపు చూడండి. ఉత్సాహంగా ఉండండి. జీవితం ఎంత కష్టంగా అనిపిస్తే.. విజయవంతం కావడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుందని అన్నారు. ఇక ఈ పారాలింపిక్స్ పోటీల్లో భారత్ తరుపున 10 మంది ఆటగాళ్లు పాల్గోంటున్నారు.

గురువారం జరిగిన 100 మీటర్ల బట్టర్ ఫ్లయ్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో అతను పోటీని 1:07.12 సెకన్లలో పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. కేవలం 0.58 సెకన్ల తేడాతో ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. 21 ఏళ్ల ఈ భారత స్విమ్మర్ తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్ తరఫున పోటీ పడుతున్న ఒకే ఒక్క స్విమ్మర్ శరత్ కాగా... ఇతను మొత్తం నాలుగు ఈవెంట్లలో బరిలోకి దిగుతున్నాడు.

100 మీటర్ల బట్టర్ ఫ్లయ్ ముగియగా, ఇంకా 100 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్, 50 మీ. ఫ్రీ స్టయిల్, 200 మీ. మెడ్లే ఈవెంట్లలో పోటీపడనున్నాడు. ఈ మెగా ఈవెంట్ కోసం అతను పెర్త్‌లోని ప్రముఖ వెస్టర్న్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ క్యాంపులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తదుపరి పోటీలో భాగంగా శనివారం శరత్ 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో పాల్గొంటాడు.

31st August:

* Naresh Sharma in the 10m Air Rifle Standing SH1 event. The qualifiers are at 1.30 PM and the finals at 5 p.m.

1st September:

* Sharath Gaekwad in the 100m Breaststroke S8 at 3 PM. The finals are at 10:50 p.m.

2nd September:

* Jaideep Singh Deswal in the Discus Throw F42 at 4:20 p.m.

* Rajinder Singh Rahelu in the (-67.5kg) Powerlifting at 7:30 p.m.

* Narender Ranbir in the Javelin Throw-F44 at 11:35 p.m.

* Jagseer Singh in the Long Jump F46 at 15 minutes past midnight (technically 00.15 a.m. 3rd September).

3rd September:

* Sharath Gaekwad in the 50m Freestyle Swimming S8 at 4 p.m. The finals of the same are at 30 minutes past midnight (technically 00.30 a.m. on 4th September).

* Girisha Nagarajegowda in the High Jump F42 at 4:20 p.m.

4th September:

* Naresh Sharma in the 50m Rifle Prone SH1 at 1:30 p.m. The finals are at 4 p.m.

* Sachin Chaudhary in the (-82.5kg) Powerlifting at 4:30 p.m.

5th September:

* Naresh Sharma in the 50m Rifle Three Positions-SH1 at 1:30 p.m. Finals are at 6:30 p.m.

6th September:

* Amit Kumar Saroha in the Discus Throw-F51 at 2:30 p.m.

* Sharath Gaekwad in the 200m Individual Medley Swimming* SM8 event. The qualifiers are at 2 p.m. and the finals at 10 p.m.

తెలుగు వన్ఇండియా

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sharath Gayakwad, India’s only swimmer at the Paralympics has missed out on the finals of the 100m Butterfly event after missing out by 0.58 seconds.
Please Wait while comments are loading...