వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థాకరేది బీహార్: దిగ్విజయ్ సింగ్ ఎదురుదాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Digvijay Singh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోకి చొరబాటు అంశంపై మహారాష్ట్ర నవ నిర్మాణసమితి (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే చేసిన వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాజ్ థాకరే కుటుంబం బీహార్‌కు చెందిందని కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాజ్ థాకరే కుటుంబం పశ్చిమ మధ్యప్రదేశ్‌లోకి వలస వెళ్లి, ఆ తర్వాత ముంబైకి చేరిందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ముంబై చరిత్రను చూస్తే అది జాలర్ల నగరం అనేది అర్థమవుతుందని, మిగతా వారంతా బయటి నుంచి స్థిరపడినవారేనని ఆయన అన్నారు. మహారాష్ట్రలోకి థాకరేనే చొరబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. తమకు సమాచారం ఇవ్వకుండా టీనేజర్‌ను అరెస్టు చేసిన ముంబై పోలీసులపై బీహారీ అధికారులు చర్యలు తీసుకుంటే మహారాష్ట్రలోని బీహారీలను పంపించేస్తామని రాజ్ థాకరే శుక్రవారం హెచ్చరించారు.

మహారాష్ట్రలో హిందీ మాట్లాడేవారిపై థాకరే తరుచుగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఓ యువకుడిని బీహార్‌లో అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు.

కేంద్రంలో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ రాజ్ థాకరేను ప్రోత్సహిస్తోందని బీహార్ జెడియు నాయకుడు శివానంద తివారీ విమర్శించారు. పంజాబ్‌లో జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలేను తయారు చేసినట్లు మహారాష్ట్రలో రాజ్ థాకరేను కాంగ్రెసు తయారు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్ థాకరే రాజ్యాంగాధికారానికి సవాల్ విసురుతున్నారని ఆయన అన్నారు.

English summary
Just hours after his sensational statement over "infiltrators" and "Biharis", Maharashtra Navnirman Sena (MNS) chief Raj Thackeray faced criticism from many. But Congress general secretary Digvijay Singh's statement on him might be the toughest one which could be hard to digest for Thackeray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X