జర్నలిస్టులపై భానుకిరణ్ ఫిర్యాదు, పరువుతీస్తున్నారని

భాను కిరణ్ ఫిర్యాదును చర్లపల్లి అధికారులు సికింద్రాబాదులోని కుషాయిగుడా పోలీసులకు అందజేశారు. భాను కిరణ్ నలుగురు ప్రింట్ మీడియా జర్నలిస్టులపై, ఓ న్యూస్ చానెల్ జర్నలిస్టులపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
తన ప్రతిష్టను దిగజార్చడానికి కావాలనే తనపై జర్నలిస్టులు బురద చల్లుతున్నారని భాను కిరణ్ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను జనరల్ డైరీలో నమోదు చేశారు. దీనిపై తాము న్యాయసలహా కోరామని, కేసు మాత్రం ఇంకా నమోదు చేయలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.
హంద్రీ నీవా కాంట్రాక్టులకు సంబంధించిన మీడియాలో వచ్చిన వార్తలపై భాను కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని హంద్రీ నీవా కాంట్రాక్టులు కొంత మందికి దక్కేలా భాను కిరణ్ ముఠా ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications