హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జర్నలిస్టులపై భానుకిరణ్ ఫిర్యాదు, పరువుతీస్తున్నారని

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: తప్పుడు వార్తలతో తన పరువు తీస్తున్నారంటూ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ఐదుగురు జర్నలిస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం అతను ఈ ఫిర్యాదు చేశాడు. నేరపరిశోధక విభాగం (సిఐడి) పోలీసులు భాను కిరణ్‌ను ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఉన్నాడు.

భాను కిరణ్ ఫిర్యాదును చర్లపల్లి అధికారులు సికింద్రాబాదులోని కుషాయిగుడా పోలీసులకు అందజేశారు. భాను కిరణ్ నలుగురు ప్రింట్ మీడియా జర్నలిస్టులపై, ఓ న్యూస్ చానెల్‌ జర్నలిస్టులపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

తన ప్రతిష్టను దిగజార్చడానికి కావాలనే తనపై జర్నలిస్టులు బురద చల్లుతున్నారని భాను కిరణ్ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను జనరల్ డైరీలో నమోదు చేశారు. దీనిపై తాము న్యాయసలహా కోరామని, కేసు మాత్రం ఇంకా నమోదు చేయలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.

హంద్రీ నీవా కాంట్రాక్టులకు సంబంధించిన మీడియాలో వచ్చిన వార్తలపై భాను కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని హంద్రీ నీవా కాంట్రాక్టులు కొంత మందికి దక్కేలా భాను కిరణ్ ముఠా ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి.

English summary
Alleging that he was being defamed by certain journalists, prime accused in the Maddelacheruvu Suri murder case, Bhanu Kiran lodged a police complaint against five journalists on Sunday. Bhanu has been lodged at the Cherlapalli prison since his arrest by Crime Investigation Department (CID) sleuths in April.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X