హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణా జలాలు డెల్టాకే ముందు: వడ్డే శోభనాద్రీశ్వర రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vadde Sobhanadriswar Rao
హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి నీటి విడుదలపై స్టేను ఎత్తి వేయించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టులో సోమవారం వాదన జరగనున్నందున వాస్తవ పరిస్థితులు వివరించడం ద్వారా స్టేను ఎత్తి వేయించాలని కోరారు. కృష్ణా జలాల్లో మొదటి ప్రాధాన్యత కృష్ణా డెల్లాకే ఉందన్నారు.

అయినా 160 సంవత్సరాల చరిత్ర కలిగిన కృష్ణా డెల్లాలో ఖరీఫ్‌లో వరి తప్ప ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల మధ్య వైషమ్యాలతో... ఇప్పటికే ఢిల్లీల్లో రాష్ట్రం మాటకు చెల్లుబాటు లేకుండా పోయి... రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు. ఈ వైఖరిలో మార్పు రాకపోతే... మరింత నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేవారు.

ముఖ్యమంత్రి సైతం ఒక ప్రాంతానికి వ్యక్తిగా గాకుండా రాష్ట్రానికి సీఎం అన్న గురుతర బాధ్యతగా మెలగాలని అన్నారు. కొందరు పెద్దలు రాజకీయాలకు పోతూ ప్రాంతాల మద్య వైషమ్యాలు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. అయితే తాము ఏ ప్రాంతానికి సైతం నీరు ఇవ్వవద్దని చెప్పడం లేదని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో నిర్మించే ప్రాణహిత-చేవెళ్ల, కాంతాలపల్లి ప్రాజెక్టులకు తాము ఏనాడూ అభ్యంతరం చెప్పలేదన్నారు.

ప్రభుత్వం సైతం ట్రిబ్యునల్ ఎదుట సరైన వాదనలు వినిపించలేకపోయిందన్నారు. నీటి పంపకాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే.. రాబోయే తరాలకు న్యాయం చేసిన వారం అవుతామని అన్నారు. కనీసం వచ్చే జూన్ నాటికైనా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.

English summary
Former minister Vadde Sobhanadriswar Rao said that first proirity in releasing of water should be Krishna delta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X