విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ కుమార్ ఫోన్: దీక్ష విరమించిన బుద్ద ప్రసాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mandali Budhaprasad
విజయవాడ: డెల్టాకు కృష్ణా నది జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా దీక్ష చేస్తున్న మాజీ మంత్రి మండలి బుద్ద ప్రసాద్‌కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం ఫోన్ చేశారు. డెల్టా పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రిని పంపుతానని బుద్ద ప్రసాద్‌కు కిరణ్ హామీ ఇచ్చారు. వెంటనే దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. కిరణ్ హామీ మేరకు బుద్ద ప్రసాద్ దీక్షను ఈ రోజు విరమించారు. కాగా సోమవారం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఫోన్ చేశారు.

కాగా డెల్టాకు కృష్ణా నది జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కృష్ణాడెల్టా తీవ్రమైన నీటిసంక్షభంలో కూరుకుపోతే కనికరం చూపకపోగా డెల్టావాసులపై విద్వేషాన్ని నూరిపోస్తున్నందుకు నిరసనగా, వెంటనే డెల్టాకు సాగునీరు విడుదలచేయాలంటూ మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్ కృష్ణాజిల్లా అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

ద్వేషం, అయిష్టత గాలిలో వ్యాప్తిచేస్తున్న వారి హృదయాల్లో పరివర్తన రావాలని, కృష్ణాడెల్టా వాస్తవ పరిస్థితులను వారే గమనించాలని కోరుతూ గాంధీజీ సూచించిన 'వ్యక్తి సత్యాగ్రహం' చేస్తున్నట్లు ఆయన ప్రకటించి వెంటనే దీక్షలో కూర్చున్నారు.రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామని ప్రమాణంచేసిన మంత్రులు, దేశ ప్రయోజనాలు కాపాడుతామని ప్రమాణంచేసిన ఎంపీలు డెల్టా గురించి తెలియకుండానే అర్ధంలేకుండా మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

డెల్టాకు నీటి విడుదలపై అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రాంతీయ భేదాలతో మాట్లాడడం పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. చేపల చెరువులకు నీటిని వదులుతున్నారంటూ రాయలసీమ ఎంపి ఎస్పీ.వై.రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమైనవంటూ, ఆయన డెల్టా ప్రాంతాన్ని ఏనాడైనా ఆయన చూశారా? అని ప్రశ్నించారు.

దురుద్దేశాలను వ్యాప్తిచేస్తూ, డెల్టా ప్రాంతంపై దుష్ప్రచారం చేస్తున్న వారు డెల్టాలోని దుర్భిక్ష పరిస్థితులను గమనించాలని మండలి కోరారు. తన సత్యా గ్రహ దీక్షకు రాజకీయ కోణంతో చూడరాదని ఆయన సూచించారు.

English summary
CM Kiran Kumar Reddy has make phone to former minister Budhaprasad on Tuesday morning to withdraw his deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X