• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిదంబరం భార్య, కొడుకుపై భూకబ్జా ఫిర్యాదు: వివరణ

By Srinivas
|
Chidambaram
చెన్నై: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కుటుంబ సభ్యులు రూ.100 కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేశారంటూ 50 మందికి పైగా జాలర్లు సోమవారం చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కాంచీపురం జిల్లా ముట్టుకాడు పంచాయతీ పరిధిలోని కరికాట్టుపురం జాలర్ల గ్రామానికి సమీపంలో పదిహేను ఎకరాల భూమి రెవెన్యూ శాఖకు చెందినది.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని జాలర్లకు ఇవ్వాలని నిర్ణయించిందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ భూమిని చిదంబరం సతీమణి నళిని, ఆయన తనయుడు కార్తీ చిదంబరం, బంధువులు కలిసి తప్పుడు దస్తావేజులతో కబ్జా చేశారని ఆరోపిస్తూ పలువురు జాలర్లు ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన స్థలాన్ని వారు ఆక్రమించుకోవడంతో సముద్రంలోకి వెళ్లడానికి, వలలు ఆరబెట్టడానికి ఇబ్బందిగా ఉందని దక్షిణ భారత జాలరి సంఘం అధ్యక్షుడు పాలయ్యన్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

కాగా ఈ విషయం తెలుసుకున్న చిదంబరం సతీమణి నళిని తరఫు న్యాయవాది స్పందించారు. చిదంబరం కుటుంబ సభ్యులు ఎలాంటి స్థలాన్ని స్వాధీనపర్చుకోలేదని చెప్పారు. నళిని న్యాయవాది అరుణ్ నటరాజ్ కమిషనర్‌కు వివరణ పత్రం కూడా అందించారు. అది ఆక్రమణ స్థలం కాదని, ఇరవై ఏళ్లుగా తమ పర్యవేక్షణలోనే ఉందని చెప్పారు. కాగా దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A fresh complaint of land grabbing was filed against Union Home Minister P Chidambaram’s son, Karthi Chidambaram, and his wife Nalini, on charges such as forgery, land grabbing, violation of CRZ regulations and illegal reclamation of land, at Karikattukuppam village, off the East Coast Road (ECR).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more