• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గీతిక ఆత్మహత్య: తార నూపుర్‌కు పోలీసు క్వొశ్చన్స్

By Pratap
|
Nupur Mehta-Geetika Sharma
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో పోలీసు విచారణను తప్పించుకుందామని బాలీవుడ్ వర్ధమాన తార నూపుర్ మెహతా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నూపుర్ మెహతాను పోలీసులు మంగళవారం విచారించారు. ముంబైలో ఆమెను ప్రశ్నించారు. నూపుర్ విచారణ తర్వాత గీతికా శర్మ ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని రహస్యాలు వెలుగు చూస్తాయని భావించారు.

గీతికా శర్మ ఆత్మహత్య కేసు ఇప్పటికే పలు మలుపులు తీసుకుంది. నూపుర్ మెహతా వెల్లడించే విషయాలు దర్యాప్తులో కీలకమవుతాయని పోలీసులు భావించారు. ఈ కేసులో నిందితుడైన హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందా, అంకితా సింగ్‌కు గల సంబంధంపై, వారికి కలిగిన సంతానంపై తొలిసారి బయటపెట్టింది నూపుర్ మెహతానే. సూసైడ్ నోట్‌లో గీతికా శర్మ అంకిత పేరును కూడా ప్రస్తావించింది.

కందాకు చెందిన ఎండిఎల్ఆర్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసిన నూపుర్ మెహతాకు కందాతో సన్నిహిత సంబంధాలున్నాయని భావిస్తున్నారు. ఆమెకు కందా ఫ్లాట్, నగదు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంకితకు, గీతికకు మధ్య గొడవ జరిగిందని, అంకిత గీతిక అపార్టుమెంటులోకి చొరబడి లాప్‌టాప్, పాస్‌పోర్టు, సంచీ తీసుకుని వెళ్లినట్లు కేసు నమోదైనట్లు ఆమె చెప్పింది.

23 ఏళ్ల గీతికా శర్మ ఆగస్టు 5వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆయన 11 రోజుల పాటు పరారీలో ఉన్నారు. గీతికా శర్మ ఆగస్టు 5వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. దానికి ముందు రాసి పెట్టిన సూసైడ్ నోట్‌లో ఆమె కందాపై, ఆయన ఉద్యోగిని అరుణా చద్ధాపై ఆరోపణలు చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Despite her efforts to avoid grilling by the Delhi police, Bollywood starlet Nupur Mehta could not save herself. The cops on Tuesday, Sep 4 questioned her over Geetika Sharma suicide case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more