వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు సెక్సువల్ వేధింపులు: సునీల్‌పై తస్లిమా నస్రీన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Taslima Nasreen
న్యూఢిల్లీ: సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, ప్రముఖ బెంగాలీ రచయిత సునీల్ గంగోపాధ్యాయ తనను లైంగికంగా వేధించినట్లు అజ్ఞాతంలో ఉన్న బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆరోపించారు. ఈ మేరకు సంక్షిప్త సందేశాల వెబ్‌సైట్ ట్విట్టర్‌లో మరికొన్ని ఆరోపణలు కూడా చేశారు.

తన నవల ద్విఖండితో నిషేధంతోపాటు బెంగాల్ నుంచి తన బహిష్కరణలోనూ సునీల్ కీలక పాత్ర పోషించారని, తననే కాదు, చాలామంది మహిళలను లైంగికంగా వేధించారని, ఆయన సాహిత్య అకాడమీ అధ్యక్షుడుగా ఉండటం సిగ్గు.. సిగ్గు అని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించేందుకు గంగోపాధ్యాయ తిరస్కరించారు. తాను చేయాల్సిన పని చాలా మిగిలి ఉందని, ఇలాంటి వాటిపై మాట్లాడే సమయం తనకు లేదని ఆయన అన్నారు.

ఢిల్లీలో గుర్తు తెలియని ప్రదేశంలో అజ్ఞాతంలో ఉన్న తస్లీమా హఠాత్తుగా విరుచుకు పడేందుకు ఓ కారణం ఉంది. బెంగాల్‌లో సీనియర్ పోలీసు అధికారి నజ్రుల్ ఇస్లాం రాసిన ఓ పుస్తకంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధానాలపై పరోక్ష విమర్శలు చేశారు. దీంతో దాన్ని ప్రచురించిన సంస్థ కార్యాలయంపై నిఘా విభాగం పోలీసులు సోమవారం దాడులు చేశారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది. దీన్ని ఖండిస్తూ పుస్తక నిషేధానికి తాను వ్యతిరేకినని సునీల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనపై మండిపడ్డ తస్లీమా, ఆయన కపటస్వభావి అని ఆరోపించారు. తన రచన నిషేధం, తన బహిష్కరణలకు అసలు కారకుడు ఆయనేనన్న నిజాన్ని వెల్లడిస్తున్నానంటూ ట్విట్టర్‌లో తాజా ఆరోపణలు గుప్పించారు.

English summary
Exiled Bangladeshi author Taslima Nasreen accused noted author Sunil Gangopadhyay of sexually harassing her and other women. She also alleged that the President of the Sahitya Akademi was actively involved in banning her novel 'Dwikhandito' and her "banishment" from West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X