వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాజిక్ ఫిగర్: మన్మోహన్‌పై అమెరికా డైలీ వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
వాషింగ్టన్: భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌పై అమెరికా దినపత్రిక వాషింగ్టన్ పోస్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అత్యంత అవినీతికరమైన ప్రభుత్వానికి అనిశ్చితమైన, వ్యర్థమైన బ్యూరోక్రాట్ నేతృత్వం వహిస్తున్నారని వ్యాఖ్యానించింది. భారత మౌన ప్రధాన మంత్రి ట్రాజిక్ ఫిగర్‌గా మారారని ఆ పత్రిక విమర్శించింది.

భారతదేశాన్ని మన్మోహన్ సింగ్ ఆధునిక, సంపద్వంత, అధికార మార్గం పట్టించారని, కానీ మన్మోహన్ సింగ్‌ బిడియం, మృదుభాషి అయిన 79 ఏళ్ల చరిత్రలో వైఫల్యాలకు మూలమైన ప్రధానిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని విమర్శకులు అంటున్నారని ఆ పత్రిక ఓ వార్తాకథనంలో విశ్లేషించింది.

భారత ఆర్థిక సంస్కరణలకు సూత్రధారి అయిన మన్మోహన్ సింగ్ అమెరికాతో సత్సంబంధాల వెనక ఉన్నారని, విశ్వ చిత్రపటంపై ఆయనకు విశేష గౌరవం ఉందని వ్యాఖ్యానించింది. కానీ గౌరవనీయమైన, మర్యాదపూర్వకమైన, మేధో టెక్నాక్రాట్ అయిన మన్మోహన్ సింగ్ మెల్లగా భిన్నమైన స్థితికి చేరుకున్నారని చెప్పింది.

బొగ్గు గనుల కేటాయింపులో అవనీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ, మన్మోహన్ సింగ్ రాజీనామాకు డిమాండ్ చేస్తుండడంతో గత రెండు వారాలుగా పార్లమెంటు వాయిదా పడుతూ వస్తోందని రాసింది. రెండో విడత ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రతిష్ట దిగజారుతూ వచ్చిందని వ్యాఖ్యానించింది.

English summary
Prime Minister Manmohan Singh has been described as "a dithering, ineffectual bureaucrat presiding over a deeply corrupt government" by a leading US daily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X