హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హర్షారెడ్డి కేసులో మలుపు: భార్య రిలేటివ్స్ కిడ్నాపర్లు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harsha Reddy
హైదరాబాద్: యశోదా హాస్పిటల్ వైద్యుడు హర్షా రెడ్డి కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. హర్షా రెడ్డిని ఆయన భార్య తరఫు బంధువులే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హర్షా రెడ్డి రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురయ్యారు. విచారణ చేపట్టిన పోలీసులు ప్రాథమికంగా భార్య తరఫు బంధువులే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇందుకు వారికి కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. ఆస్తి తగాదాలు కారణమని భావిస్తున్నారు. అతని భార్య హేమను ఈ కోణంలో పోలీసులు గురువారం ప్రశ్నిస్తున్నారు.

కాగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మలక్‌పేట యశోదా ఆస్పత్రి లో పనిచేస్తున్న హర్షా రెడ్డి కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. మొదట్లో కనిపించడంలేదని చాదర్‌ఘాట్ పోలీసులకు మంగళవారం సాయంత్రం ఫిర్యాదు అందింది. కాగా ఆ డాక్టర్ మొబైల్ నుంచి అతని తండ్రికి ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ కేసును కిడ్నాప్ కేసుగా భావిస్తూ ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం - మలక్‌పేట నివాసి డాక్టర్ హర్షారెడ్డి (31) మలక్‌పేట య శోదా ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. రోజూ మాదిరిగానే హ ర్షా రెడ్డి సోమవారం సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి వెళ్లి మంగళవారం ఆస్పత్రికి రాకపోవడంతో అతని స్నేహితుడు హేమంత్ చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డాక్టర్ హర్షా రెడ్డి తప్పిపోయినట్లుగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

హర్షా రెడ్డి తల్లిదండ్రులు విజయవాడలో ఉంటున్నారు. అయితే మంగళవారం ఉదయం హర్షా రెడ్డి మొబైల్ నుంచి అతని తండ్రి లక్ష్మారెడ్డి ఇంటి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చే సి రూ. 40లక్షలు ఇవ్వాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు డిమాండ్ చేశారు. దీంతో లక్ష్మారెడ్డి ముందుగా తన కుమారుడు ఎక్కడ ఉన్నాడంటూ అతని స్నేహితుడైన హేమంత్‌ను వాకబు చేయగా కనిపించడంలేదంటూ చెప్పి చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని వివరించారు.

దీంతో తనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి రూ.40 లక్షలు డిమాండ్ చేసిన విషయాన్ని లక్ష్మారెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మంగళవారం సాయంత్రం చేరుకొని చాదర్‌ఘాట్ పోలీసులకు వివరించారు. దాంతో పోలీసులు డాక్టర్ హర్షా రెడ్డి మిస్సింగ్ కేసును కిడ్నాప్‌గా పరిగణిస్తూ కేసును ఆకోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

మణిపాల్ మెడికల్ కాలేజీలో పిజి స్టూడెంట్ హేమ ప్రసన్నను హర్షా రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. కొంత మంది సహోద్యోగులతో కలిసి అతను యశోదా ఆస్పత్రి వెనక ఓ అపార్టమెంటులో ఉంటున్నాడు. సోమవారం హర్ష నివాసానికి రాలేదు, ఫోన్ చేస్తే కలవడం లేదు. ఆస్పత్రి సిసిటివీ కెమెరాలను మిత్రుడు హేమంత్ తనిఖీ చేశాడు. సాయంత్రం ఐదున్నరకే ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినట్లు నిర్ధారించుకున్నాడు.

English summary
The Hyderabad police were questioned the wife of the kidnapped doctor Harsha Reddy on Thursday. His wife was a gynecologist in Manipal who arrived in the city after she apparently got the information on the alleged kidnap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X