• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒబామాను పొగడ్తలతో ముంచెత్తిన మిచెల్లీ, ఉద్వేగంగా

By Srinivas
|

Michelle Obama
వాషింగ్టన్: తన భర్త మిడిల్ క్లాస్ అమెరికన్స్ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆమె సతీమణి మిచెల్లీ ఒబామా పొగడ్తలతో ముంచెత్తారు. బుధవారం చార్లోట్‌లో డెమొక్రటిక్ జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో ఆమె ప్రసంగించారు. డీలాపడిన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించగలిగిన అధ్యక్షుడిగా ఒబామా విశ్వసించదగిన వ్యక్తని కితాబిచ్చారు. ఇంటి వద్ద బాధ్యత కలిగిన భాగస్వామిగా, శ్రద్ధాసక్తులు చూపే తండ్రిగా ఆయనను అభివర్ణించారు.

ఆర్థిక మందగమనం నుంచి నెమ్మది, నెమ్మదిగా కోలుకోవడమేనది వేదన కలిగిస్తున్నా.. ఒబామాను దేశం మళ్లీ శ్వేతసౌధంలోకి ఆహ్వానిస్తోందంటూ మిషెల్లీ చెప్పుకొచ్చారు. సుదీర్ఘ పయనం మొదలు పెట్టినట్టుగా ఆయన ఓ సందర్భంలో చెప్పారని, మార్పు అనేది ఒక్కసారిగా వచ్చేది కాదని, ఆర్థికాభివృద్ధి నత్తనడక, అత్యధిక శాతం నిరుద్యో గంతో జాతి అసహనంగా ఉండొచ్చని.. కానీ వాటిని అధిగమించడం కష్టమేమీ కాదని ఉద్వేగంగా చెప్పారు.

ఒబామాకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మిషెల్లీ ప్రసంగానికి సభికులు కరతాళ ధ్వనులు చేశారు. కాగా అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నిక కానున్న తొలి హిందూ అమెరికన్‌గా తుల్సి గబార్డ్‌కు సభ్యుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. గత నెలలో హవాయ్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఆమె గెలిచారు. కువాయిట్ ఆర్మీ నేషనల్ గార్డు అవార్డు పొందిన తొలి మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు కూడా. ఇక ఒబామాకు గట్టి మద్దతుదారైన షికాగో ఇంజనీర్ స్మితా షా కూడా అరుదైన ఘనత సాధించారు.

డిఎన్‌సి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న తొలి భారత అమెరికన్‌గా ఆమె రికార్డు సాధించారు. ఒబామా విజయం కోసం ఏర్పాటు చేసిన ఎన్నికల నిధికి ఆమె అత్యధిక మొత్తంలో 70 వేల డాలర్ల మేరకు విరాళం అంద జేశారు. మూడురోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తొలి రోజే రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీపై డెమొక్రాట్లు విరుచు కుపడ్డారు. మసాచుసెట్స్ గవర్నర్‌గా అత్యధిక కాలం పనిచేసిన ఆయన తన వ్యక్తిగత ఖాతాలను మాత్రం దండిగా పెంచుకో గలిగారంటూ పలువురు వక్తలు దుయ్యబట్టారు.

English summary
First Lady Michelle Obama told an audience attending the Hispanic caucus meeting Wednesday that her husband, and not his Republican challenger, would be committed to helping everyone – not just the privileged – improve their lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X