వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు బలం లేకే: వైయస్ విజయమ్మ, దీక్షలో భారతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma - YS Bharathi
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని ఉన్నా తమకు అంత బలం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శుక్రవారం అన్నారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద రెండో రోజు విజయమ్మ తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కిరణ్ ప్రభుత్వం సమస్యలను చూస్తూ కూడా నిద్ర పోతున్నట్లుగా నటిస్తోందని ఆరోపించారు.

తమకు అవిశ్వాసం పెట్టాలని ఉన్నప్పటికీ తమకు అంత బలం లేక ఊరుకుంటున్నామని చెప్పారు. తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు అన్నీ పరిష్కారమవుతాయన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి ఉన్న విజన్ కిరణ్ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. పెద్ద చదువులు పేదల హక్కుగా ప్రభుత్వం భావించడం లేదన్నారు. దివంగత వైయస్ పైన ఉన్న కక్షతో ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు.

ఫీజు పథకం సక్రమంగా అమలవుతోందని ముఖ్యమంత్రి, మంత్రులు గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్సుమెంట్సును క్రమంగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ప్రభుత్వానికి చేవలేదన్నారు. నిరుపేదలకు ఏం చేయాలో ఎలా చేయాలో వైయస్ చేసి చూపించారన్నారు. చదువులపై పెట్టుబడిని వైయస్ సామాజిక పెట్టుబడిగా భావించారని అదే వైయస్ విజయన్ అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తానే ఫీజు రీయింబర్సుమెంట్సు పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు చెబుతున్నారని, అలా ఒక్క విద్యార్థితోనైనా చెప్పించగలరా అని ప్రశ్నించారు. బిసిల పట్ల బాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో గత ఎన్నికలలోనే తేలిపోయిందన్నారు. కాగా రెండో రోజు విజయమ్మ దీక్షలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి పాల్గొన్నారు.

English summary
YSR Congress patry chief YS Jaganmohan Reddy's wife YS Bharati Reddy participated in YS Vijyamma's Fee Reimbursements fast on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X