హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యశోద డాక్టర్ కిడ్నాప్ కథ సుఖాంతం, ఆస్తి తగాదాలే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harsha Reddy
హైదరాబాద్: యశోదా ఆసుపత్రి వైద్యుడు హర్షా రెడ్డి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఆయనను పోలీసులు కిడ్నాపర్ల చెర నుండి విడుదల చేయించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు కృష్ణా జిల్లా నూజివీడులోలో హర్షా రెడ్డి ఆచూకీ కనుగొన్నారు. ఆస్తి తగాదాలతోనే హర్షా రెడ్డిని అపహరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే కిడ్నాప్ చేసింది తండ్రి తరఫు బంధువులేనని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. హర్షా రెడ్డిని అపహరించిన నిందితుల కోసం ఆరు బృందాలు వేట సాగిస్తున్నాయి.

మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో ఉన్న హర్షా రెడ్డికి సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేసిన బంధువు ఫోన్ చేశాడు. పరిచయం మాత్రమే కాక బంధుత్వం ఉన్న వ్యక్తి కావడంతో హర్ష బయటికి వెళ్లి కలిశాడు. చిన్న పని ఉందని, ఎల్‌బి నగర్ వరకు వెళ్లదామని కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే కారులో మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. నేరుగా విజయవాడ హైవే పైనుంచి వెళుతుండగా తాము ఎక్కడికి వెళుతున్నామని హర్షా రెడ్డి ప్రశ్నించడంతో వారంతా కలిసి తీవ్రంగా కొట్టి ఆరిస్తే చంపేస్తామని బెదిరించారు. నేరుగా నూజీవీడు ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఓ ఇంట్లో బంధించారు.

కాగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మలక్‌పేట యశోదా ఆస్పత్రి లో పనిచేస్తున్న హర్షా రెడ్డి కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. మొదట్లో కనిపించడంలేదని చాదర్‌ఘాట్ పోలీసులకు మంగళవారం సాయంత్రం ఫిర్యాదు అందింది. కాగా ఆ డాక్టర్ మొబైల్ నుంచి అతని తండ్రికి ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ కేసును కిడ్నాప్ కేసుగా భావిస్తూ ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం - మలక్‌పేట నివాసి డాక్టర్ హర్షారెడ్డి (31) మలక్‌పేట య శోదా ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. రోజూ మాదిరిగానే హ ర్షా రెడ్డి సోమవారం సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి వెళ్లి మంగళవారం ఆస్పత్రికి రాకపోవడంతో అతని స్నేహితుడు హేమంత్ చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డాక్టర్ హర్షా రెడ్డి తప్పిపోయినట్లుగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

హర్షా రెడ్డి తల్లిదండ్రులు విజయవాడలో ఉంటున్నారు. అయితే మంగళవారం ఉదయం హర్షా రెడ్డి మొబైల్ నుంచి అతని తండ్రి లక్ష్మారెడ్డి ఇంటి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చే సి రూ. 40లక్షలు ఇవ్వాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు డిమాండ్ చేశారు. దీంతో లక్ష్మారెడ్డి ముందుగా తన కుమారుడు ఎక్కడ ఉన్నాడంటూ అతని స్నేహితుడైన హేమంత్‌ను వాకబు చేయగా కనిపించడంలేదంటూ చెప్పి చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని వివరించారు.

దీంతో తనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి రూ.40 లక్షలు డిమాండ్ చేసిన విషయాన్ని లక్ష్మారెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మంగళవారం సాయంత్రం చేరుకొని చాదర్‌ఘాట్ పోలీసులకు వివరించారు. దాంతో పోలీసులు డాక్టర్ హర్షా రెడ్డి మిస్సింగ్ కేసును కిడ్నాప్‌గా పరిగణిస్తూ కేసును ఆకోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

మణిపాల్ మెడికల్ కాలేజీలో పిజి స్టూడెంట్ హేమ ప్రసన్నను హర్షా రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. కొంత మంది సహోద్యోగులతో కలిసి అతను యశోదా ఆస్పత్రి వెనక ఓ అపార్టమెంటులో ఉంటున్నాడు. సోమవారం హర్ష నివాసానికి రాలేదు, ఫోన్ చేస్తే కలవడం లేదు. ఆస్పత్రి సిసిటివీ కెమెరాలను మిత్రుడు హేమంత్ తనిఖీ చేశాడు. సాయంత్రం ఐదున్నరకే ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినట్లు నిర్ధారించుకున్నాడు.

English summary

 Yashoda Hospital radiologist Dr Sri Harsha Reddy, who went missing a couple of days ago, was traced in Krishna district late on Thursday night. Though police were unwilling to disclose the motive, Sources said a property dispute within the family led to his abduction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X