హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2జి స్కామ్: జెపిసి ముందుకు సుబ్బారావు

By Pratap
|
Google Oneindia TeluguNews

D Subbarao
హైదరాబాద్: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ప్రస్తుత గవర్నర్ దువ్వూరు సుబ్బారావు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ముందు హాజరు కానున్నారు. సుబ్బారావు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు 2జి లైసెన్సుల కేటాయింపులు జరిగాయి. 2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో సాక్షిగా ఆయన ఈ నెల 18వ తేదీన జెపిసి ముందు హాజరు కానున్నారు.

సుబ్బారావు 2007 ఏప్రిల్, 2008 సెప్టెంబర్ మధ్య కాలంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. వివాదాస్పదమైన రేడియోవేల్ లైసెన్సుల కేటాయింపులు 2008 జనవరిలో జరిగాయి. నిజానికి జెపిసి సమావేశం ఈ నెల 14వ తేదీన జరగాల్సి ఉండింది. ఆ రోజు క్యాబినెట్ మాజీ కార్యదర్శి కెఎం చంద్రశేఖర్ జెపిసి ముందు హాజరు కావాల్సి ఉంది.

చంద్రశేఖర్‌ను ప్రశ్నించడానికి మరో తేదీని నిర్ణయించనున్నారు. 2007 జూన్ నుంచి 2011 జూన్ వరకు ఆయన ఉన్నతాధికారిగా పనిచేశారు. ఓ నెల తర్వాత జెపిసి సమావేశం సెప్టెంబర్ 18వ తేదీన జరుగుతోంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను, ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని సాక్షులుగా పిలువాలని డిమాండ్ చేస్తూ బిజెపి సభ్యులు ఆగస్టు 22వ తేదీన జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. సమావేశాన్ని బహిష్కరించారు.

ఈ నెల 18వ తేదీన జరిగే సమావేశానికి బిజెపికి చెందిన ఆరుగురు సభ్యులు హాజరవుతారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. మన్మోహన్ సింగ్‌ను, చిదంబరాన్ని ప్రశ్నించాలని తాము డిమాండ్ చేసినందుకు కాంగ్రెసు సభ్యులు తమను అసభ్య పదజాలంతో దూషించారని బిజెపి సభ్యులు ఆరోపించారు. అయితే, బిజెపి ఆరోపణలను కాంగ్రెసు ఖండించింది.

English summary
RBI Governor D Subbarao, who was the Finance Secretary when 2G licenses were allocated, will appear before the Joint Parliamentary Committee examining the issue as a witness on Sept 18. He was the Finance Secretary between Apr 2007 and Sept 2008.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X