వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబే కలుస్తారు: 'విలీనం'పై జగన్ పార్టీ, అవమానంలేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dharmana Krishnadas
హైదరాబాద్: 'విలీనం' వార్తలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాసు, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసులో తమ పార్టీ విలీనమయ్యే ప్రసక్తే లేదని, అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదని వారు అన్నారు. తమ పార్టీలో ఎవరికీ అవమానం జరగలేదని, ఓ వర్గం మీడియా కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెసు నేతలను చాటుగా కలుస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే ఆ పార్టీలో చేరుతారన్నారు.

ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే బాబు దానిని పూర్తిగా విస్మరించారన్నారు. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు పాదయాత్ర జపం చేస్తున్నారని, కానీ ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు మంచి సలహాదారుడు అని విమర్శించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను కనీసం 30 రోజులైనా నిర్వహించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని, అందుకే సమావేశాలకు వెనుకాడుతోందన్నారు.

మంత్రి వర్గ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలకు కిరణ్ కుమార్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించారని, ఆయన త్వరలోనే బయటకు వస్తారని, ప్రజల అభిమానంతో తమ పార్టీ గెలుపు సాధిస్తుందన్నారు. జగన్ రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోనూ కీలక నేతగా ఎదుగుతారన్నారు.

English summary

 YSR Congress party mlas Dharmana Krishnadas and Srikanth Reddy said on Sunday that TDP chief Nara Chandrababu Naidu will join in Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X