వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంలో జగన్ చక్రం తిప్పుతారు: గోనె, చిరుపై నిప్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ్ రావు ఆదివారం అన్నారు. సేవ్ కాంగ్రెసు పార్టీ పేరుతో శనివారం రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ఏర్పాటు చేసిన సమావేశం పైన గోనె మండిపడ్డారు. కాంగ్రెసును రక్షిస్తానని విహెచ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.

ఏదో ఒక నియోజకవర్గంలో విహెచ్ పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. విహెచ్ తన సొంత నియోజకవర్గంలో తన బలాన్ని నిరూపించుకోగలరా అని సవాల్ విసిరారు. ఆయనకు అక్కడ ప్రజల బలమే లేదన్నారు. 2004లో, 2009లో కాంగ్రెసు పార్టీని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గెలిపించలేదా చెప్పాలని ప్రశ్నించారు. వైయస్ వల్లే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెసు రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు.

అవినీతి గురించి చిరంజీవి మాట్లాడటం వింతగా ఉందని విమర్శించారు. తమిళనాడులో ఆదాయపన్ను ఎందుకు కడుతున్నారో చిరంజీవి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసుకు అమ్ముడుపోయిన చిరంజీవికి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తామని చెప్పలేదన్నారు. పిటిఐ వార్తా కథనం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

జగన్ సిఎం అవుతారు... ఉప్పునూతల

నాటి కాంగ్రెసుకు, ఇప్పటి కాంగ్రెసుకు ఎంతో తేడా ఉందని సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాలో అన్నారు. ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న నాయకుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. 2014 ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డియే ముఖ్యమంత్రి అవుతారన్నారు. కాంగ్రెసు, టిడిపి తుడిచి పెట్టుకుపోవడం ఖాయమన్నారు.

English summary
YSR Congress party leader Gone Prakash Rao said on Sunday that party chief YS Jaganmohan Reddy will play key role in central politics in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X