వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ కోసమే చేరా, జగన్‌ను సిఎం చేస్తాం: ఉప్పునూతల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Upuunuthala Purushotham Reddy
హైదరాబాద్: నల్గొండ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి ఆదివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఉప్పునూతలతో పాటు జాతీయ యువజన కాంగ్రెసు మాజీ ప్రధాన కార్యదర్శి చామల తదితరులు పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జగన్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉప్పునూతల మాట్లాడారు. తాను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కోసమే పార్టీలో చేరినట్లు చెప్పారు.

తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఉపన్యాసాలకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు వణుకుతున్నారన్నారు. గడపగడపకు వైయస్సార్ కాంగ్రెసును తీసుకు వెళ్తామని చెప్పారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేసే వరకు తాను పోరాటం చేస్తానని చెప్పారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీని కార్యకర్తలే నడిపిస్తున్నారన్నారు. పార్టీకి వారే కొండంత అండ దండ అన్నారు.

ఈ రోజు ఉప్పునూతల తమ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టారన్నారు. ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు వచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. త్వరలో జగన్ బయటకు వస్తారని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాం నాటి సువర్ణయుగం వస్తుందని అన్నారు.

కాగా నల్గొండ జిల్లాలో ఉప్పునూతల ముఖ్య నేత. ఆలేరు, భువనగిరి, తుంగతుర్తిలలో పట్టు ఉంది. దీంతో అక్కడ కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని అంటున్నారు. మరోవైపు ఉప్పునూతల జగన్ పార్టీలో చేరినప్పటికీ ఆయన వెంట ప్రధాన నేతలు ఎవరూ వెళ్లడం లేదని, కొందరు కిందిస్థాయి వారే వెళుతున్నారని, అలాంటప్పుడు అక్కడ తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని కాంగ్రెసు చెబుతోంది.

English summary
Congress party senior leader Uppunuthala Purushotham 
 
 Reddy joined in YSR Congress party on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X