• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌తో ప్యాచప్ కోసం కాదు: వైయస్ డైరీపై ఆజాద్

By Pratap
|
YS Jagan-Ghulam Nabi Azad
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో ప్యాచప్ కోసమే రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు ఢిల్లీలో వైయస్ డైరీ ఆవిష్కరణ సభ పెట్టారనే వార్తలను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఖండించారు. ప్యాచప్ కోసమే కెవిపి ఆ కార్యక్రమం పెట్టారనే విమర్శల్లో నిజం లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ తమ ప్రత్యర్థేనని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి వేరు, జగన్ వేరు అని ఆయన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

వైయస్ జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపదను పోగేసుకున్నాడని, వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడికి అందుకు సహకరించారని కాంగ్రెసుకు చెందిన ఓ వర్గం విమర్శిస్తుండగా, మరో వర్గం వైయస్సార్‌ను ప్రశంసిస్తోందని, ఇటువంటి పరస్పర విరుద్ధమైన వైఖరులు ఎందుకని అడిగితే నా సోదరుడు నేరం చేస్తే నాకేమిటి సంబంధమని, దానికి నేను ఎలా బాధ్యత వహిస్తానని ఆయన ఎదురు ప్రశ్న వేశారు.

వైయస్ రాజశేఖర రెడ్డి వేరు, జగన్ అవినీతి వేరని, రెండింటికి మధ్య సంబంధం అంటగట్టుకూడదని ఆయన అన్నారు. జగన్ సంపదను కూడగట్టుకోవడానికి వైయస్సార్ సహాయపడ్డారని సిబిఐ ఆరోపిస్తుంది, లింక్ లేదని ఎలా అంటారని అడిగితే వైయస్సార్ తప్పు చేశాడా, ఒప్పు చేశాడా అనేది కోర్టు నిర్ణయించనీయండని ఆయన అన్నారు. జగన్ విషయంలో కూడా అదే వర్తిస్తుందని ఆయన అన్నారు. సిబిఐ కొన్ని ఆరోపణలు చేసిందని, అవి కోర్టులో తేలే దాకా ఆగాల్సి ఉందని, తాము ఇందులో తలదూర్చదలుచుకోలేదని ఆయన అన్నారు.

తుది శ్వాస వరకు వైయస్సార్ కాంగ్రెసు నాయకుడిగానే ఉన్నారని, వైయస్సార్‌ది గొప్ప వ్యక్తిత్వమని, కాంగ్రెసు నాయకుడిని ప్రశంసించడంలో తప్పేమిటని ఆయన అన్నారు. జగన్‌ను కాంగ్రెసు కావాలని ఇరికిస్తే తమ పార్టీ నేతలను కాపాడుకోలేకపోయామా అని ఆయన అడిగారు. కొంత మంది కాంగ్రెసు నాయకుల పేర్లను కూడా చార్జిషీట్‌లో చేర్చారని, వారు కూడా అరెస్టయ్యారని ఆయన గుర్తు చేశారు. యుపిఎ నాయకులు, కాంగ్రెసు నాయకులు కొంత మంది కేసుల్లో ఇరుకున్నారని, వారిని కావాలని కాంగ్రెసు ఇరికిస్తుందా అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఇప్పుడు చర్చ జరగడం లేదని, నాయకత్వ మార్పులపై వచ్చిన వార్తలను తాను ఖండిస్తున్నానని, అయితే తమకు పరిణామాలూ పరిస్థితులు అన్నీ తెలుసునని, సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉందని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Andgra Pradesh affairs incharge Ghulam Nabi Azad says to an english daily on reporets of patchup bid with YS jagan's YSR Congress "I deny any such thinking. We treat Jagan’s party as an opposing party. I repeat, YSR was different and Jagan is different. There is no point in accusing YSR unnecessarily".

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more