వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ వారే ప్రణబ్ కొడుకుని కాలర్ పట్టుకొని కుమ్మేశారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Abhijith Mukherjee
న్యూఢిల్లీ/అగర్తాలా: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు, పశ్చిమ బెంగాల్ శాసనసభ్యుడు అభిజిత్ ముఖర్జీకి త్రిపురలో ఈ నెల ఆరో తేదిన ఘోర అవమానం జరిగింది. త్రిపుర పిసిసి అధ్యక్షుడిని అడగకుండానే రాష్ట్రంలోకి అడుగు పెట్టారంటూ పలువురు పార్టీ ఫాలోవర్స్ అభిజిత్ కాలర్ పట్టుకొని లాక్కెళ్లి కొట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. త్రిపుర కాంగ్రెసులోని వర్గ విభేదాలే ఈ దాడికి కారణమని సమాచారం.

గత గురువారం అభిజిత్ త్రిపుర రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సొంత పార్టీ కార్యకర్తలు ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసి కమిటీ ప్రధాన కార్యదర్శి సుబాల్ భౌమిక్ సోమవారం అగర్తాలలో తెలిపారు. దాడి జరిగిన సమయంలో తానూ పక్కనే ఉన్నానని చెప్పారు. అభిజిత్ అగర్తాలకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బముతియాలోని కాళీ బజార్‌లో త్రిపుర తొలి సిఎం సచీంద్రలాల్ సిన్హా పేరుతో నెలకొల్పిన గ్రంథాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణమైన అభిజిత్ వద్దకు టిపిసిసి మరో ప్రధాన కార్యదర్శి బలై గోస్వామి సమీపంలోనే ఉన్న పార్టీ కార్యాలయాన్ని సందర్శించాలని ఆయనను కోరారు. కార్యాలయానికి చేరుకున్న అభిజిత్ కారు దిగుతుండగానే కొందరు కాంగ్రెసు కార్యకర్తలు ఆయన కాలర్ పట్టుకొని కిందకి లాగి కార్యాలయం లోపలికి లాక్కొని వెళ్లారు. అక్కడ అతనిపై చేయి చేసుకున్నారని భౌమిక్ తెలిపారు.

దాడికి తానే ప్రత్యక్ష సాక్షిని, తాను ఒక్కడినే అయినందున వారిని అడ్డుకోలేక పోయానని తెలిపారు. టిపిసిసి అధ్యక్షుడు సుదివ్ రాయ్ బర్మస్‌కు చెప్పకుండా త్రిపురకు ఎందుకొచ్చారని అభిజిత్‌ను కాంగ్రెసు కార్యకర్తలు నిలదీశారని చెప్పారు. ఈ దాడి ఘటనను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈ నెల 7వ తేదిన వివరించానని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.

English summary

 President Pranab Mukherjee’s son and Congress MLA Abhijit was assaulted by a group of party activists, Tripura PCC General Secretary Subal Bhowmick today alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X