వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యలమంచిలి ఎమ్మెల్యే, కుటుంబ ఆస్తులపై విచారణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: జిల్లాకు చెందిన యలమంచిలి శాసనసభ్యుడు ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు(కన్నబాబు), ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని విశాఖ ఎసిబి న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ అడారి ఆదిమూర్తి అనే వ్యక్తి ఎసిబి కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జి.వి.కృష్ణయ్య ప్రాథమిక సాక్ష్యాధారాలు పరిశీలించి విచారణ జరిపి అక్టోబర్ 11లోగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఎసిబి డిఎస్పిని ఆదేశించింది.

అంతకుముందు కూడా కన్న బాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని హైకోర్టు రెండు రోజుల క్రితం విచారణకు స్వీకరించింది. తాజాగా ఆదిమూర్తి విశాఖ కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయడంతో అక్కడి కోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

కన్న బాబుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందు వల్ల సిఆర్‌పిసి సెక్షన్ - 156/3 క్రింద కేసు నమోదు చేసి విచారించాలని విశాఖ ఎసిబి డిఎస్పీని కోర్టు ఆదేశించింది. కన్న బాబు స్వయంగా గాక ఆయన భార్య రమాదేవి, కుమారుడు సుకుమార్ వర్మ, కుమార్తె రోజారాణీల పేరిట కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

వీరిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపనున్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కిషోర్ వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 11వ తేదికి కేసు వాయిదా వేశారు. కాగా కన్న బాబు ఎనిమిదేళ్లలో వేయి కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారన్న ఆరోపణలపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

English summary
Vishakapatnam ACB court ordered to probe on Yalamanchili MLA Kanna Babu and his family properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X