వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్టూనిస్టు అసీం త్రివేది విడుదల: ఘనస్వాగతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Aseem Trivedi
ముంబై: తాను వేసిన కార్టూన్లకు గాను కేసుల్లో ఇరుక్కున్న అసీం త్రివేది బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు వద్ద ఇడియా అగైనెస్ట్ కరప్షన్ మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. తమ కొత్త హీరోకు వందే మాతరం, భారత్ మాతా కీ జై వంటి నినాదాలతో స్వాగతం చెప్పారు.

అసీం త్రివేది అరెస్టుపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగింది. పార్లమెంటును, జాతీయ పతాకను, జాతీయ చిహ్నాన్ని అవమానించాడనే ఆరోపణలపై అసీం త్రివేది అరెస్టయ్యారు. దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం సాగిస్తానని విడుదలైన తర్వాత అసీం త్రివేది చెప్పారు.

తనపై రాజద్రోహం కింద చేసిన నేరారోపణలను ఉపసంహరించుకునే వరకు తాను పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. ఆయన తనను తాను స్వాతంత్ర్య సమరవీరులతో పోల్చుకున్నారు. గాంధీ, నెహ్రూలపై కూడా రాజద్రోహం కేసులు పెట్టారని, వారు దేశభక్తులు కారా అని ఆయన అన్నారు.

కోర్టు కేసులన్నిటికీ తాను సహకరిస్తానని, రాజద్రోహం కింది నేరారోపణను తాను అంగీకరించబోనని ఆయన అన్నారు. తన విడుదలకు మాత్రమే పోరాటం సాగదని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే అన్ని నిబంధనలపై తన పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు.

ఐదు వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బొంబాయి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను తీసుకోవడానికి ఆయన తొలుత నిరాకరించారు. బెయిల్‌ను అంగీకరించడానికి ఆయన తండ్రి అశోక్ త్రివేది కూడా నిరాకరించారు. తన కుమారుడు ఏ విధమైన తప్పు చేయలేదని ఆయన అన్నారు.

English summary
Cartoonist Aseem Trivedi got a heroic reception by his supporters and India Against Corruption (IAC) members when he walked out of Arthur Road jail in Mumbai on Wednesday, Sept 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X