వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసభ్యకర భంగిమలు: పట్టుబడిన లీడర్, టివి యాంకర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jammu Kashmir Map
శ్రీనగర్: అసభ్యకర భంగిమలకు సంబంధించిన ఆరోపణలపై అధికార నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ శాసనమండలి సభ్యుడు, మరో టివి యాంకర్ పైన శ్రీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని నిగీన్ ప్రాంతంలోని ఒక హౌస్‌బోట్‌లో వీరు అభ్యంతకరకర పరిస్థితులలో పట్టుబడినట్లు.. వీరిపై సెక్షన్ 294 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. ఈ మాజీ శాసనమండలి సభ్యుడు గతంలో దక్షిణ కాశ్మీర్ నుంచి ఎన్నికైనట్లుగా సమాచారం. ఆయన సంఘటనా స్థలం నుండి తప్పించుకొని పోగా, ఆ యాంకర్‌ను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. సదరు టివి యాంకర్ పైన రాంబాగ్‌లోని మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం ఓ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ పైన దాడి చేసిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వెళుతున్న మంత్రి కారును ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు. దీనిపై మంత్రి సెక్యూరిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు దాడిగి దిగారు. ఇది పెద్ద దుమారం రేపింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సోమవారం ఈ ఘటన జరగ్గా మంగళవారం వారిని అరెస్టు చేశారు.

English summary
A ruling National Conference leader and a woman TV anchor have been booked on charges of indecent exposure in Nigeen area of the city, Police sources said on today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X