చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో ప్రత్యక్షమైన వివాదాస్పద స్వామి నిత్యానంద

By Pratap
|
Google Oneindia TeluguNews

Nithyananda Swamy
చెన్నై: వివాదాస్పద స్వామి నిత్యానంద బుధవారం తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రత్యక్షమయ్యారు. అరెస్టు నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఆయన అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన తిరువణ్ణామలైలో పూజలు చేశారు. ఆయనను ఊరేగింపుగా ఆలయానికి తీసుకుని వచ్చారు. ఆయనను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది.

స్వామి నిత్యానందపై అరెస్టు వారంట్ పెండింగులో ఉంది. దీంతో ఆయన పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాను ఆజ్ఝాతంలో లేనని, తాను అన్నింటికీ సిద్ధంగానే ఉన్నానని ఆయన చెప్పారు. తాను చట్టవ్యతిరేకిని కానని, చట్టానికి తగిస సమాధానం చెప్పేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. తాను కోర్టు నుంచి తప్పించుకుని తిరుగుతున్నానని చెప్పడంలో నిజం లేదని ఆయన అన్నారు. పిఠాధిపతి అరుణగిరి మసైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. నిత్యానందపై చాలా కేసులున్నాయి.

నిత్యానంద సినీ నటి రంజితతో కలిసి విదేశాలకు తప్పించుకు వెళ్లే ప్రయత్నాలు చేశారని గత నెల మొదటి వారంలో వార్తలు వచ్చాయి. నిత్యానంద శిష్యుడు కౌషిక్‌ను పోలీసులు గురువారం న్యూఢిల్లీలో అప్పట్లో చేశారు. అతని నుండి 32 పాసుపోర్టులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని నుండి పలు విషయాలు పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది.

రంజితతో కలిసి నిత్యానంద నేపాల్ మీదుగా విదేశాలకు తప్పించుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిత్యానంద ప్రస్తుతం రంజితతో కలిసి మానస సరోవర యాత్రలో ఉన్నారు. ఆ యాత్ర అనంతరం అటు నుండి నేరుగా నేపాల్ వెళ్లేందుకు నిత్యానంద, రంజితలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మానస సరోవర యాత్ర నుండి తిరిగి రాగానే నిత్యానందను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, అది సాధ్యం కాలేదు

నిత్యానంద దాదాపు నెల రోజులకుపైగా తప్పించుకు తిరుగుతున్నారు. లింగ నిర్ధారణ పరీక్ష చేసేందుకు సహకరించడం లేదు. మరోవైపు కోర్టు కూడా అతనికి బెయిల్ నిరాకరించింది. రంజితతో పాటు మరో ముప్పై మంది శిష్యులతో అతన హిమాలయాలలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. హిమాలయాలలో ఉన్న నిత్యానంద ట్రావెల్ ఏజెట్ల ద్వారా తన మిగిలిన శిష్యుల పాసుపోర్టులను వెనక్కి పంపించాడు. కేవలం శిష్యులను తిరిగి వెనక్కి పంపించి అతను రంజితతో పాటు నేపాల్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడని ప్రచారం సాగింది.

English summary
Controversial godman Swami Nithyanada appeared in Tamil Nadu state capital Chennai today. It is saif that he may be arrested at any time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X