వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం తెలంగాణకు వ్యతిరేకం, జగన్ మిత్రుడే: అసదుద్దీన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకమని మజ్లీస్ (ఎంఐఎం) అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టంచేశారు. తాము రాయల తెలంగాణకే కట్టుబడి ఉన్నామని, లేని పక్షంలో హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరారు.

బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో మజ్లిస్ వైఖరి ఎప్పటికీ మారబోదన్నారు. గతంలో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికకే ఇప్పటికీ తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో ఎంఐఎంకు పొత్తేమీ లేదని చెప్పారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తనకు మంచి మిత్రుడని, అందుకే జైలుకు వెళ్లి పరామర్శించానని, ఇందులో రాజకీయాలు ఏవీ లేవని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో లౌకిక అభ్యర్థి అయిన ప్రణబ్‌కు ఓటు వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కృతజ్ఞతలు తెలిపేందుకు మరోమారు జగన్‌ను కలుస్తానని తెలిపారు.

మజ్లీస్ పార్టీ హైదరాబాద్‌లో బలంగా ఉంది. హైదరాబాద్ పార్లమెంటు సీటును ఆ పార్టీయే గెలుచుకుంటూ వస్తోంది. అలాగే, కొన్ని జిల్లాల్లో ఆ పార్టీకి తగిన బలం ఉంది. కడప, కర్నూలు జిల్లాలతో కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఆ జిల్లాల్లోని బలంతో ముందుకు సాగవచ్చునని మజ్లీస్ భావిస్తోంది.

English summary

 MIM president and Hyderabad MP Asaduddin Owaisi said that his party is against granting statehood for Telangana. He said that his party will support Rayala Telanagana, if bifurcation is imminent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X