వికలాంగులను పెళ్లాడితే రూ. 50 వేలు: ముఖ్యమంత్రి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - మహిళా సంఘాల మాదిరిగా వికలాంగులకు 40 వేల గ్రూపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉద్యోగాల్లో వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించామని అన్నారు. ఎవరైనా వికలాంగులను వివాహం చేసుకుంటే వారికి ప్రభుత్వం నుంచి రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. త్వరలో స్వయం ఉపాధి పథకం ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు అందించే ఏర్పాటు చేస్తామని సీఎం పేర్కొన్నారు.
జిల్లాలో సీఎం పర్యటన, ఈ నెల 17వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన ఎంజీఎల్‌ఐ, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. సుమారు 35వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ట్రయల్‌రన్ ఇప్పటికే విజయవంతమైంది. మూడు రోజుల పర్యటన సందర్భంగా సీఎం, వివిధ వర్గాలతో సమావేశం కావడంతో పాటు జిల్లాకాంగ్రెస్ సమావేశంలో కూడా సీఎం పాల్గొంటారు.
తెలంగాణ ప్రాంతంలో మొదటిసారిగా ఈ జిల్లాలోనే ఇందిరమ్మ బాట ప్రారంభం కానున్న దృష్ట్యా, ఎట్టిపరిస్థితుల్లో కూడా దీనిని సాఫీగా కొనసాగించేందుకు అధికారపార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.