వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ నుండి వసంతకు రూ.10 లక్షలు: జయప్రకాశ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vasantha Nageshwara Rao
విజయవాడ: జై ఆంధ్ర సభ నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నుండి జై ఆంధ్ర ఉద్యమకర్త వసంత నాగేశ్వర రావుకు రూ.10 లక్షలు ముట్టాయని సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడు అడుసుమిల్లి జయప్రకాశ్ ఆదివారం అన్నారు. కెసిఆర్, ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు తదితరులు సమైక్యవాదులను దూషించినప్పుడు వసంత ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

కెసిఆర్‌తో 45 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయిన వసంత నాగేశ్వర రావు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కండువ మెడలో కప్పుకున్నారన్నారు. తెరాస కండువ కప్పుకున్న వసంతను సమైక్యాంధ్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని మండిపడ్డారు. సమైక్యాంధ్ర నేతలను విమర్శించడం ఆయనకు సరికాదన్నారు.

కాగా అంతకుముందు రోజు ప్రాంతీయ విద్వేషవాదులతో వసంత కుమ్మక్కయ్యారని, చరిత్ర తెలుసుకోకపోతే అతను చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని అడుసుమిల్లి మండిపడ్డారు. మొట్టమొదట్లో ఆంధ్రులకు గుర్తింపు తేవడానికి 1913 మే 26న బాపట్లలో న్యాయపతి సుబ్బారావు అధ్యక్షతన ఆంధ్ర మహాసభ ఏర్పాటయిందని చెప్పారు. ఈ సభలో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం తీర్మానం చేశారని, ఆ తర్వాత పలుమార్లు సభలు జరిగాయన్నారు.

తెలంగాణలో మొదటి ఆంధ్ర మహాసభలు 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో సురవరం ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించారన్నారు. ఆ తర్వాత తెలంగాణలోను పలు సభలు జరిగాయన్నారు. చరిత్ర తిరగరాస్తే తెలుగువారంతా కలిసి ఉండాలన్న ఉద్యమం వంద ఏళ్ల క్రితం ప్రారంభమైందన్నారు.

English summary

 United Andhra leader Adusumilli Jayaprakash alleged that Jai Andhra leader Vasantha Nageshwara Rao took Rs.10 lack from TRS chief K Chandrasekhar Rao to organige Jai Andhra meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X