హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై సోనియాకు లేఖ: సైన్ చేయని మంత్రులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mukesh Goud-Danam Nagendar
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ తెలంగాణ ప్రాంత మంత్రులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి సోమవారం లేఖ రాశారు. వెంటనే తెలంగాణను ప్రకటించాలని వారు ఆ లేఖలో అధినేత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రకటిస్తే ఇరు ప్రాంతాలలో కాంగ్రెసు పార్టీ బలంగా తయారవుతుందని, లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సి ఉంటుందని వారు సోనియా దృష్టికి తీసుకు వెళ్లారు. సాధ్యమైనంత తొందరగా రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయాలని వారు కోరారు. తెలంగాణ తప్ప ప్యాకేజీలు వద్దని కోరారు.

కాగా మంత్రులు రాసిన ఈ లేఖలో రాజధానికి చెందిన ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ మినహా మిగతా తెలంగాణ ప్రాంత మంత్రులు అందరూ సంతకం చేశారు. ముఖేష్, దానం సంతకాలు చేయక పోవడాన్ని విలేకరులు ప్రశ్నించగా కాంగ్రెసు నేతలు మాత్రం అదేం లేదని, వారు కూడా తెలంగాణ కోరుకుంటున్నారని, తెలంగాణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.

కోదండరాం వ్యాఖ్యలు ఖండించిన టి-ఎంపీలు

కాగా మంత్రి శ్రీధర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ తీరును టి-ఎంపీలు తప్పు పట్టారు. తెలంగాణ కోసం అందరూ కలిసి పోరాడాల్సి ఉందని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులం అయినప్పటికీ తాము జెఏసి కార్యక్రమాల్లో తెలంగాణ కోసం పాల్గొన్నామని, కానీ మంత్రులపై అలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం కోదండరాంకు సరికాదని పొన్నం ప్రభాకర్, వివేక్ అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సమైక్యవాదులను ప్రోత్సహిస్తూ జైఆంధ్ర, జై తెలంగాణవాదులపై పోలీసు జులుం చూపిస్తోందన్నారు. పోలీసు కేసులు ఎత్తివేస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిగా ఎత్తి వేయలేదన్నారు. కోదండ వ్యాఖ్యలు సరికాదని బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. కోదండరామ్ పై కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి డిమాండ్ చేశారు.

కాగా వినాయక చవితి పండుగ నేపథ్యంలో తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేయాలని తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఎంపీలు, మంత్రులు తెలంగాణ జెఏసికి విజ్ఞప్తి చేశారు. బిజెపి కూడా ఇంతకుముందే ఈ విషయాన్ని టిజెఏసి దృష్టికి తీసుకు వెళ్లింది.

English summary
Telangana region ministers wrote a letter to AICC president Sonia Gandhi on Telangana issue. Ministers Danam Nagender and Mukesh Goud did not signed on this letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X