• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇటలీలోను పోటీ: రాహుల్‌పై మోడీ ఎద్దేవా, నితీష్ విషెస్

By Srinivas
|

Narendra Modi-Rahul Gandhi
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీపై సోమవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనను రాహుల్‌తో పోల్చవద్దని, అతను అంతర్జాతీయ నాయకుడు అని అలాంటి వ్యక్తితో తనను పోల్చుకోవడం సరికాదని సెటైర్ వేశారు. రాహుల్ భారత్, ఇటలీ దేశాలకు చెందిన నేత అన్నారు. రాహుల్ భారత్‌లో ఓడిపోతే ఇటలీలో కూడా పోటీ చేసే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు.

తాను భారత్‌లో ప్రాంతీయ నేతను అయినందుకు గర్విస్తున్నానని మోడీ చెప్పారు. గతంలో ఓ కాంగ్రెసు నేత మాట్లాడుతూ.. రాహుల్ జాతీయ నేత అని, తాను మాత్రం కేవలం ప్రాంతీయ నాయకుడు అని చెప్పారని మోడీ గుర్తు చేశారు. తాను గుజరాత్ నేతను అయినందుకు గర్విస్తున్నానని, కానీ రాహుల్ జాతీయ నేత అంటే తాను అంగీకరించనని, అతను ఇంటర్నేషనల్ లీడర్ అన్నారు. రాహుల్‌కు ఎక్కడి నుండైనా పోటీ చేసే అవకాశముందన్నారు.

కాగా ఈ రోజు(సెప్టెంబర్ 17)న నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఆయన తన తల్లి ఆశీర్వాదం తీసుకున్న ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి పాదాలకు నమస్కరించడం తనకు గ్రేటెస్ట్ దీవెనలు అని మోడీ పేర్కొన్నారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.

మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని, అతను నిండ నూరేళ్లు ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒకరి పుట్టిన రోజు సందర్భంగా మరొకరు విషెస్ చెప్పాలని, తాను కూడా అలాగే మోడీకి శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. మోడీని నితీష్ కుమార్ 2014 ఎన్నికలలో ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Gujarat chief minister Narendra Modi took a swipe at Congress general secretary Rahul Gandhi saying there was no comparison between him and Rahul. Modi said that there is no comparison between Rahul and him. Rahul is an international leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X