వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ ప్రిన్స్ భార్య అర్ధనగ్న చిత్రాలు ప్రచురించిన 'చి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kate Middleton
రోమ్: ఇటలీకి చెందిన ప్రముఖ గాసిప్స్ మ్యాగజైన్ 'చి' బ్రిటన్ యువరాజు విలియమ్ సతీమణి కేట్ కాథరీన్ అర్ధనగ్న చిత్రాలతో కూడిన ప్రత్యేక ఎడిషన్‌ను సోమవారం తీసుకు వచ్చింది. ఇందులో కేథరీన్ టాప్‌లెస్‌గా ఉంది. ఈ అర్ధనగ్న చిత్రాలపై బ్రిటన్ రాజకుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఆ కుటుంబం న్యాయపోరాటానికి సిద్ధమైంది.

బ్రిటన్ యువరాణి కేథరీన్ అర్ధనగ్న చిత్రాలను ప్రచురించిన చి పత్రిక మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీకి చెందినది. కేథరీన్ రెండు ఫోటోలను గత వారం కూడా క్లోజర్ అనే మ్యాగజైన్ ప్రచురించింది. ది క్వీన్ ఈజ్ న్యూడ్ అని పెద్ద హెడ్డింగ్‌తో మ్యాగజైన్ మొదటి పేజీలో ఆమె ఫోటోలు వేసింది. ఇది కూడా బెర్లుస్కోనీకి చెందిన సంస్థనే కావడం గమనార్హం.

కేథరీన్ ఫోటోలను అలా ప్రచురించడంపై రాజకుటుంబం న్యాయవాదులు కోర్టుకెక్కారు. వారు కోర్టుకు హాజరు కానున్నారు. కాగా 'చి' ఎడిటర్ అల్ఫోన్సో సిగ్నోరిని మాత్రం ఇవి అసాధారణమైన రిపోర్టేజ్‌గా పేర్కొన్నారు. ఇంగ్లాండ్ ఫ్యూచర్ క్వీన్ మొదటిసారి సహజంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. కాగా కోర్టుకెక్కిన రాజకుటుంబం న్యాయవాదులు క్వీన్ అర్ధనగ్న ఫోటోలను నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

English summary
The Italian gossip magazine Chi, owned by the former prime minister Silvio Berlusconi's media empire, on Monday published a special edition featuring grainy topless photos of Prince William's wife Catherine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X