వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెపి వ్యాఖ్యలు: మైక్ విరగ్గొట్టిన హరీష్, నాగం X దానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao - Jayaprakesh Rao
హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా వాయిదాల పర్వం ప్రారంభమైంది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైంది. వివిధ పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వాటిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. అనంతరం పార్టీల ఫ్లోర్ లీడర్లు తెలంగాణ అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో రగడ చోటు చేసుకుంది. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ సభలో మాట్లాడుతుండగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

జెపి మాట్లాడుతూ.. ఐబిఎం ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారని, రాష్ట్రంలో భద్రత లేనందువల్లే వారు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెపి వ్యాఖ్యలపై తెరాస ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం 80 మంది ఉద్యోగులు వెనక్కి వెళితే జెపి మాట్లాడుతున్నారని, కాని తెలంగాణ కోసం 950 మంది బలయ్యారని, దీనికి ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జెపి తన ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు.

నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి కూడా జెపి ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నాగం ఒకింత ఆవేశంగా మాట్లాడటంతో మంత్రి దానం నాగేందర్, నాగం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ రౌడీయుజం చేయొద్దంటూ నాగంకు దానం హెచ్చరించారు. నాగం పైకి సిడిలు విసరపోయి తమాయించుకున్నారు. మరోవైపు జెపి తన ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా అసహనానికి గురైన సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు మైక్ విరగ్గొట్టారు.

జెపి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యేలు మండిపడ్డారు. భద్రత లేనందున వెళ్తున్నారనేది సరి కాదన్నారు. ఉద్యోగులు వెళ్ళే అంశం కాకుండా బలిదానాలకు సమైక్యవాదులు సమాధానం చెప్పాలని నిలదీశారు. కాగా జెపి వ్యాఖ్యలు సభలో రగడకు దారి తీయడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అరగంట వాయిదా వేశారు.

English summary

 The monsoon session of the AP assembly began on a stormy note on Tuesday as legislators from various parties noisily demanded a resolution on the issue of statehood of Telangana, leading to the hous being adjourned for half an hour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X