వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంతకం ఎందుకు చేయలేదంటే: లేఖపై దానం వివరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Danam Nagendar
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, పార్టీ కోర్ కమిటీ సభ్యులకు తెలంగాణపై మంత్రులు రాసిన లేఖలో తన సంతకం లేకపోవడంపై మంత్రి దానం నాగేందర్ మంగళవారం వివరణ ఇచ్చుకున్నారు. తెలంగాణ కోసం మంత్రులు రాసిన లేఖలో తన సంతకం లేదనడం సరికాదని అన్నారు. ఆ లేఖ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను దానం ఖండించారు.

తెలంగాణ ప్రాంత మంత్రులు సంతకం పెట్టి అధిష్టానానికి పంపిన లేఖ తన వద్దకు రాలేదని చెప్పారు. గతంలో ఇచ్చిన లేఖలో తానే తొలి సంతకం పెట్టిన విషయాన్ని దానం గుర్తు చేశారు. ఈసారి మంత్రులు తన వద్దకు లేఖ పంపలేదు కాబట్టి తన సంతకం లేదని చెప్పారు. కాగా సోమవారం తెలంగాణ ప్రాంత మంత్రులు సోనియాకు, పార్టీ కోర్ కమిటీ సభ్యులకు తెలంగాణ కోరుతూ లేఖ పంపిన విషయం తెలిసిందే.

వెంటనే తెలంగాణను ప్రకటించాలని వారు ఆ లేఖలో అధినేత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రకటిస్తే ఇరు ప్రాంతాలలో కాంగ్రెసు పార్టీ బలంగా తయారవుతుందని, లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సి ఉంటుందని వారు సోనియా దృష్టికి తీసుకు వెళ్లారు. సాధ్యమైనంత తొందరగా రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయాలని వారు కోరారు. తెలంగాణ తప్ప ప్యాకేజీలు వద్దని కోరారు.

కాగా మంత్రులు రాసిన ఈ లేఖలో రాజధానికి చెందిన ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ మినహా మిగతా తెలంగాణ ప్రాంత మంత్రులు అందరూ సంతకం చేశారు. ముఖేష్, దానం సంతకాలు చేయక పోవడాన్ని విలేకరులు ప్రశ్నించగా కాంగ్రెసు నేతలు మాత్రం అదేం లేదని, వారు కూడా తెలంగాణ కోరుకుంటున్నారని, తెలంగాణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.

English summary

 Danam Nagendar said on Tuesday that T-ministers were not sent letter to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X