హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాసు విగ్రహ ధ్వంసం మా పనే, ఉండనివ్వం: యుటిఎఫ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vimalakka
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది తామేనని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మంగళవారం ప్రకటించింది. తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి, మర్రి చెన్నా రెడ్డి, జలగం వెంగళ రావుల విగ్రహాలను తాము తెలంగాణ గడ్డ పైన ఉండనిచ్చేది లేదనియుటిఎఫ్ నేతలు విమలక్క, దిలీప్ కుమార్ హెచ్చరించారు. సెప్టెంబర్ 30వ తేదిన జరగబోయే జీవ వైవిధ్య సదస్సును అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

కెబిఆర్ పార్క్ వద్ద గల కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించి, పార్క్ పేరును కూడా మార్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలోనే మరో నేత పేరు పెట్టాలని సూచించారు. తెలంగాణ బ్రతుకులను ఎద్దేవా చేసేలా ఈ గడ్డపై ఆంధ్రా నేతల విగ్రహాలు పెడుతున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణ మార్చ్‌కు ముందు ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు పెడితే కూల్చి వేస్తామని వారు హెచ్చరించారు.

కాగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం రోజున గుర్తు తెలియని దుండగులు హైదరాబాదులోని కెబిఆర్ పార్క్ వద్ద ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని సోమవారం తెల్లవారు జామున ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా విగ్రహంపై టైర్లు వేసి నిప్పు పెట్టారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధ్వంసమైన విగ్రహం కన్పించకుండా తెల్లని వస్త్రాన్ని చుట్టారు. సంఘటనా స్థలంలో తెలంగాణ జన ప్రతిఘటన పేరుతో కరపత్రాలు వదలి వెళ్లారు.

English summary

 UTF leaders Vimalakka and Dileep Kumar were claimed responsibility for distruction of former CM Kasu Brahmananda Reddy's statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X