వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్థలం అమ్మకుంటే చంపేస్తా: ఎమ్మెల్యేపై ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: యలమంచిలి శాసనసభ్యుడు కన్న బాబు తనను బెదిరించారని ఓ భూ యజమాని మంగళవారం విశాఖపట్టణంలోని ద్వారగా జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... పి అండ్ టి కాలనీకి చెందిన సన్యాసి రాజు అనే స్థిరాస్తి వ్యాపారి గొలుగొండ మండలం కసిమి పంచాయతి వడపర్తి గ్రామంలో 40 ఎకరాల భూమిని నాలుగేళ్ల క్రితం కొన్నారు. సన్యాసిరాజుకు ఈ నెల 16న ఓ ఫోన్‌కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ఎమ్మెల్యే కన్నబాబుని మాట్లాడుతున్నానని చెప్పారు.

వడపర్తిలోని భూమి నీదేనా అని అడగ్గా.. సన్యాసిరావు ఔనని చెప్పారు. ఆభూమి తనకు కావాలని, వెంటనే తన ఇంటికి వచ్చి కలవాలని ఫోన్ పెట్టేశారు. దీనిని సన్యాసిరావు తేలిగ్గా తీసుకున్నాడు. సోమవారం తిరిగి అదే నంబర్ నుంచి సన్యాసిరాజుకు ఫోన్ వచ్చింది. ఆ భూమి సంగతి ఏమీ తేల్చుకున్నావంటూ సన్యాసిరాజును అడిగారు. తాను ఆ భూమిని వ్యవసాయం కోసం కొన్నానని దానిని అమ్మే ఉద్దేశం లేదని చెప్పాడు.

దీంతో ఆగ్రహానికి గురైన అవతలి వ్యక్తి నేనడిగితే కాదంటావా?..నేనెవరో తెలుసా..అధికార పార్టీ ఎమ్మెల్యేని బెదిరించారు. నిన్ను జుట్టుపట్టుకుని ఇంట్లో నుంచి లాక్కొచ్చి రిజ్రిస్టేషన్ చేయించుకుంటానని హెచ్చరించాడు. ఎదురు తిరిగితే ప్రాణాలు తీసేందుకు వెనుకాడను..నీకు 24 గంటలు సమయమిస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేశారు. మధ్యాహ్నం తెల్లటి మారుతీ కారులో కొంతమంది వ్యక్తులు సన్యాసిరాజు ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు.

దీంతో భయపడిన సన్యాసిరాజు ఎమ్మెల్యే నుంచి రక్షించాలంటూ ద్వారకా జోన్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లారు. ఫిర్యాదు తీసుకునేందుకు వెనుకాడడంతో తిరిగి మంగళవారం స్టేషన్‌కు వచ్చి సిఐని కలిసి ఫిర్యాదును అందజేశారు. మరోవైపు ఎమ్మెల్యే కన్నబాబు తనను చంపేస్తానని బెదిరించినట్టు సన్యాసిరాజు తమకు ఫిర్యాదు చేయలేదని ద్వారకా జోన్ సిఐ కృష్ణారావు తెలిపారు. తనను చంపుతానని కన్నబాబు బెదిరిస్తున్నట్టు రాతపూర్వకంగా సమాచారం ఇస్తున్నానని, ఫిర్యాదు మాత్రం కాదని తమతో చెప్పినట్టు సిఐ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని సిఐ చెప్పారు.

English summary
A complaint larged in Vishakapatnam against 
 
 Yalamanchili MLA Kanna Babu on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X