వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రిన్స్ భార్య కేట్ అర్ధనగ్న చిత్రాలు: ఐరిష్ ఎడిటర్‌పై వేటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

British Flag
లండన్: బ్రిటన్ యువరాణి కేట్ అర్ధనగ్న ఫొటోలు ప్రచురించినందుకు ఐరిష్ దినపత్రిక డైలీ స్టార్ ఎడిర్ మైకేల్ ఒకేన్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు బిబిసి వార్తా సంస్థ తెలిపింది. ప్రిన్స్ విలియమ్, కేట్ జంట తమ విహారయాత్రలో భాగంగా దక్షిణ ఫ్రాన్స్‌లోని ఓ బీచ్‌లో సూర్య స్నానం చేస్తున్న దృశ్యాలను శక్తిమంతమైన కెమెరాతో రహస్యంగా చిత్రీకరించారు. వీటిని తొలుత ఫ్రెంచి మాగజైన్ క్లోజర్ ప్రచురించింది.

వెంటనే విలియమ్ దంపతులు ఫ్రాన్స్ కోర్టును ఆశ్రయించగా వాటి ప్రచురణను నిలిపివేయాలని, అసలు చిత్రాలను వారికి 24 గంటల్లో అందజేయాలని సదరు పత్రికను ఆదేశించింది. కానీ, ఈ ఆదేశాలు మంగళవారంగానీ జారీకాకపోవడంతో సదరు ఫొటోలు శనివారం నాటి డైలీ స్టార్ సంచికలో ప్రత్యక్షమయ్యాయి.

కాగా అర్ధనగ్న ఫోటోల విషయమై ఫ్రాన్సులో విచారణ చేపట్టారు. క్లోజర్ పత్రికలో వచ్చిన ఫోటోలు ఫ్రెంచ్ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఉందా లేదా అనే కోణంలో సంపూర్ణ దర్యాఫ్తు చేపట్టారు. మరోవైపు తమ యాత్రను కొనసాగిస్తున్న యువ రాచదంపతులు ప్రస్తుతం తువాలు ద్వీపంలో విహరిస్తున్నారు.

English summary
The editor of the Irish Daily Star has been suspended from his role over the publication of topless photographs of the duchess of Cambridge Kate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X