హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినిమాలు చూస్తుంటే వెళ్లిపోవాలనిపిస్తుంది!: రోశయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: పాత సినిమాలు చూస్తుంటే ఎంత పని ఉన్నా లేచి వెళ్లడానికి మనసు ఒప్పదని, ఈతరం చిత్రాలు చూస్తుంటే.. తనకైతే పని లేకపోయినా వెళ్లిపోవాలనిపిస్తుందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య బుధవారం అన్నారు. నాటి చిత్రాలు విజయవంతంగా నడిచేవని, నేటి సినిమాలు విరక్తి పుట్టిస్తున్నవని ఆయన విచారం వ్యక్తం చేశారు. రవీంద్రభారతిలో రాగ సప్తస్వరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఎన్ఆర్ స్వర్ణ కంకణ ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అర్థం పర్థం లేని సినిమాలు వస్తున్నాయని ఆవేదన చెందారు. శ్రమను మరిపించే విధంగా సినిమాలు రావాలని, సిని పరిశ్రమకు సూచించారు. అక్కినేని నాగేశ్వర రావు సినీ జీవితంలో ఎదురు లేని నటుడిగా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని కొనియాడారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్వీ రమణమూర్తి మాట్లాడుతూ.. క్లిష్టతరమైన హాస్యాన్ని పండిస్తూ మనందరికి ఆనందాన్ని అందిస్తున్న విలక్షణ నటుడు బ్రహ్మానందాన్ని అక్కినేని పేరుతో సత్కరించడం సంతోషకరం అన్నారు.

తాను బతకడానికి కారణమైన రోశయ్యకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మనిషి చనిపోయేంత వరకు నవరసాల్లో హాస్యం, శృంగారం రెండూ ఉంటాయన్నారు. మేథావి వర్గానికి చెందిన వ్యక్తి బ్రహ్మానందం హాస్యంతో ఆరోగ్యాన్ని పెంపొందిస్తున్నారన్నారు. సమాచార కమిషనర్ విజయ బాబు ఈ కార్యక్రమంలో అధ్యక్షోపన్యాసం చేశారు.

English summary
Tamilnadu governor Konijeti Rosaiah said that there is 
 
 no moral quality in president cinemas
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X