వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం విప్‌ల లేఖ: సంతకం చేయని జగ్గారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jagga Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ మొన్న మంత్రులు, నిన్న కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్టానానికి లేఖ రాయగా శుక్రవారం విప్‌లు రాశారు. తెలంగాణను వెంటనే ప్రకటించాలని, ఈ నెల 30న తెలంగాణ మార్చ్ ఉన్న నేపథ్యంలో ఆ లోపే ఈ అంశంపై ఓ ప్రకటన చేయాలని విప్‌లు ఆ లేఖలో అధిష్టానాన్ని కోరారు. లేఖలో గండ్ర వెంకటరమణ రెడ్డి, ఈరవత్రి అనీల్, మోహన్‌లు సంతకం చేశారు. అయితే మెదక్ జిల్లా సంగారెడ్డి శాసనసభ్యుడు, విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) మాత్రం ఆ లేఖలో సంతకం చేయలేదు.

కాగా శుక్రవారం నాలుగోరోజు సభ ప్రారంభమైన కాసేపటికే 10.15కు వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు సభలో తీర్మానం ప్రవేశ పెట్టాలని నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి విద్యుత్ సమస్యలపై చర్చిద్దామని స్పీకర్ సభ్యులకు సూచించారు. సమావేశాలకు సహకరించాలని అధికార పార్టీ సూచించిది.

తీర్మానం ప్రవేశపెడితే సభ సజావుగా జరిగేందుకు సహకరిస్తామని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. వారు ఎంతకూ పట్టు వీడలేదు. దీంతో స్పీకర్ సభను రెండోసారి గంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో మంత్రులు శ్రీధర్ బాబు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, ప్రభుత్వ చీఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి భేటీ అయ్యారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన చాంబరులో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

కాగా సమావేశాలను తెరాస అడ్డుకుంటే ఆ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేసే అంశంపై ప్రభుత్వం చర్చిస్తుందని తెలుస్తోంది. సభకు ఈరోజు, శనివారం మాత్రమే మిగిలి ఉంది. ఇంత వరకు పట్టుమని పది నిమిషాలు కూడా ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. ఈ రెండు రోజులైనా చర్చ జరిపేందుకు తెరాస ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే విషయమై ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

English summary

 Whips wrote a letter to Congress party high command on Friday about Telangana statehood. Sangareddy MLA Jagga Reddy did not signed on this letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X