వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గీతిక ఆత్మహత్య: అరుణా చద్దా బెయిల్ ప్లీ వెనక్కి

By Pratap
|
Google Oneindia TeluguNews

Geetika Sharma
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో నిందితురాలు అరుణా చద్దా ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ట్రయల్ కోర్టులో తాజా బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసుకోవడానికి వీలుగా ఆమె ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. జస్టిస్ మన్మోహన్ బెయిల్ పిటిషన్ విచారణకు అక్టోబర్‌లో తేదీలు ఇవ్వడానికి నిరాకరించడంతో, విచారణకు డిసెంబర్‌కు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో చద్దా తరఫు న్యాయవాది రమేష్ గుప్తా బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

బెయిల్ పిటిషన్ విచారణకు అంత గడువు తీసుకోవడంతో బెయిల్ కోరిన ప్రయోజనమే దెబ్బ తింటుందని, ఈలోగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేస్తారని, పరిస్థితి పూర్తిగా మారిపోతుందని గుప్తా అన్నారు. త్వరగా బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి నిరాకరిస్తూ మన్మోహన్ పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతించారు. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.

నలభై ఏళ్ల వయస్సు గల అరుణా చద్దా మూతపడిన మాజీ హర్యానా మంత్రి గోపాల్ గోయల్ కందా ఎండిఎల్ఆర్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు. ఆత్మహత్య చేసుకున్న గీతికా శర్మ కూడా అదే సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశారు. తనకు ఏడేళ్ల కూతురు, ముదుసలి తల్లిదండ్రులు ఉన్నారని, వారి సంరక్షణ బాధ్యతలను చూసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చద్దా పిటిషన్ దాఖలు చేశారు. తన సంపాదన తప్ప తన కుటుంబానికి మరో ఆదరువు లేదని ఆమె చెప్పుకున్నారు.

23 ఏళ్ల గీతికా శర్మ ఆగస్టు 5వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆయన 11 రోజుల పాటు పరారీలో ఉన్నారు. గీతికా శర్మ ఆగస్టు 5వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. దానికి ముందు రాసి పెట్టిన సూసైడ్ నోట్‌లో ఆమె కందాపై, ఆయన ఉద్యోగిని అరుణా చద్ధాపై ఆరోపణలు చేసింది.

English summary
Aruna Chaddha, an accused in former air hostess Geetika Sharma's suicide case, today withdrew her bail plea from the Delhi HC with a liberty to file a fresh one in the trial court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X