వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా పేరు, ఫోటో వాడుకోండి: కేజ్రీవాల్‌కు పూనమ్ పాండే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Poonam Pandey
ముంబై: అవినీతిపై ఉద్యమిస్తున్న అన్నా హజారే బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్‌కు శృంగార తార పూనమ్ పాండే ఓ ఉచిత సలహా ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ పార్టీ స్థాపనకు పూనుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయనతో అన్నా హజారే విభేదించారు. అంతేకాదు కేజ్రీవాల్ తన రాజకీయ పార్టీ కోసం తన ఫోటోను ఉపయోగించుకోకూడదని అన్నా హజారే సూచించారు. దీంతో పూనమ్ కేజ్రీవాల్‌కు ట్విట్టర్‌లో ఓ సూచన చేసింది.

కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో... కేజ్రీవాల్‌జీ చింతించకండి. మీరు రాజకీయ పార్టీ స్థాపిస్తే తన ఫోటో ఉపయోగించుకోవద్దని అన్నా హజారే తిరస్కరించారు. అయినంత మాత్రాన బాధపడవద్దని, మీరు నా ఫోటోను, పేరును ఉపయోగించుకోవచ్చునని పూనమ్ సూచించారు. మీరు మీ పార్టీ కోసం నా పేరును ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీకు లబ్ధి చేకూరుస్తుందని నేను చెప్పగలనని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా ఇండియా అగైనెస్ట్ కరప్షన్ (ఐఎసి) కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్‌కు దూరంగా ఉండాలని సామాజిక కార్యకర్త అన్నా హజారే నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ పెట్టే పార్టీతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన రెండు రోజుల క్రితం చెప్పారు. దీంతో కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఐఎసి కార్యకర్తలతో అన్నా హజారే సంబంధాలను తెంచుకోవడం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందని కేజ్రీవాల్ అన్నారు.

అన్నా తమకు తండ్రిలాంటివారని, తమకు అన్నా ఆలోచనలే ప్రాణాధారమని, తమతో అన్నా సంబంధాలు తెంచుకోవాలని అనుకోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. అది దిగ్భ్రాంతికరమైన పరిణామమే కాకుండా బాధాకరమైంది, విషాదకరమైంది, అనూహ్యమైందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనపై అన్నా హజారే కేజ్రీవాల్ గ్రూప్‌తో, తమ మద్దతుదారులతో, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్‌లతో చర్చలు జరిపారు.

తొమ్మిది గంటల చర్చల తర్వాత కిరణ్ బేడీ, సంతోష్ హెగ్డే వంటివాళ్లు కూడా పచ్చజెండా ఊపడంతో రాజకీయ పార్టీ పెట్టడానికి అన్నా హజారే అంగీకరించారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌ను ఉపయోగించి ఐఎసి నిర్వహించిన సర్వేను తాను అంగీకరించలేకపోతున్నానని అన్నా హజారే అన్నారు.

రాజకీయ పార్టీ పెట్టాలనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌లో నిర్వహించిన సర్వేను ప్రాతిపదికగా తీసుకుని కేజ్రీవాల్ ఇతర అన్నా టీమ్ సభ్యులు రాజకీయ పార్టీని పెట్టేందుకు ముందుకు వచ్చారు. రాజకీయ పంథాను చేపడుతున్నవారికి తన శుభాకాంక్షలు ఉంటాయని, దాంతో ప్రమాదం ఉందని, పార్లమెంటులో మెజారిటీ పొందితే మంచిదేనని, తమ మార్గాలు వేరయ్యాయని, ఇరు వర్గాలం వేర్వేరు మార్గాలు ఎంచుకున్నామని అన్నా హజారే అన్నారు.

English summary
Arvind Kejrial can use my name and my Photo says bikini girl Poonam Pandey On Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X