హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జలదృశ్యంలోనే బాపూజీ అంత్యక్రియలు: జైపాల్ నివాళి

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Laxman Bapuji
హైదరాబాద్: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియలు హైదరాబాదులోని జలదృశ్యంలోనే జరుగుతాయి. ఈ విషయాన్ని కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు చెప్పారు. జలదృశ్యంలోనే నిర్వహించాలా, వద్దా అని ప్రభుత్వం సందేహంలో పడిన నేపథ్యంలో వివాదం చోటు చేసుకుంది. జలదృశ్యంలోనే అంత్యక్రియలు జరగాలని తెలంగాణవాదులు పట్టుబట్టారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులు కె. జానారెడ్డి, బొత్స సత్యనారాయణలతో మాట్లాడారు.

ప్రభుత్వ అధికార లాంఛనాలన్నీ పద్మశాలి భవన్‌లో జరుగుతాయని, అంత్యక్రియలు జలదృశ్యంలో జరుగుతాయని కేశవ రావు చెప్పారు. పద్మశాలి భవన్ నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కొండా లక్ష్మణ్ బాపుజీ భౌతిక కాయాన్ని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం తెలంగాణ రావాలని కోరుకున్నారని, బాపూజీ కలల సాకారం కావాల్సిన అవసరం ఉందని జైపాల్ రెడ్డి అన్నారు.

అయితే, అంత్యక్రియలు జలదృశ్యంలోనే జరపాలని డిమాండ్ చేస్తూ మొదట జైపాల్ రెడ్డిని అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ శుక్రవారం హైదరాబాదులో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

జలదృశ్యం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీకి అత్యంత ప్రియమైంది. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడేందుకు ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యాలయం కోసం ఆయన దాన్ని ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఖాళీ చేయించింది.

English summary
Congress senior leader K Keshav Rao announced that freedom fighter Konda Laxman Bapuji's last ritual will be held at Jaladrishyam of Hyderabad. Union Minister S Jaipal Reddy paid homage to Konda Laxman Bapuji.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X