హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభిప్రాయాలు సేకరిస్తున్నాం: తెలంగాణపై మనీష్‌ తివారీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manish Tiwari
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ అత్యంత సున్నితమైన అంశమని ఏఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారి సోమవారం అన్నారు. ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విషయంలో ఇరు ప్రాంత ప్రజలు, నేతల మధ్య విభిన్న వాదనలు ఉన్నాయన్నారు. దీనిపై తమ పార్టీ అధిష్టానం అందరి నుండి అభిప్రాయాలను సేకరిస్తోందని, అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధికి బాపూజీ కృషి.. సోనియా గాంధీ

తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ నిరంతరం కృషి చేశారని ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ సోమవారం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. స్వతంత్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. బాపూజీ మృతి తెలిసిన సోనియా ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతూ ఓ లేఖ పంపారు. ఇందులో ఆమె బాపూజీని కొనియాడారు. సమాజానికి ఆయన ఎనలేని సేవలు చేశారని, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేశారన్నారు.

ట్యాంక్ బండ్ పైనే తెలంగాణ మార్చ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఈ నెల 30వ తేదిన తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ను ట్యాంక్ బండ్ పైన నిర్వహించాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి సోమవారం నిర్ణయించింది. మార్చ్ అంశంపై జెఏసి టిఎన్జీవో భవనంలో మధ్యాహ్నం భేటీ అయింది. ప్రధానంగా మార్చ్ ఎక్కడ నిర్వహించాలి, ఎలా అనే దానిపై చర్చించారు. మిలియన్ మార్చ్ నిర్వహించిన ట్యాంకుబండ్ పైన నిర్వహించడమే మంచిదని జెఏసి నిర్ణయించుకుంది. దీనికి సాగర హారం అని నామకరణం చేసింది.

సబితను కలిసిన జూపల్లి, గజ్జెల కాంతం

హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని తెరాస ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు కలిశారు. మార్చ్‌కు అనుమతివ్వాలని కోరారు. వినాయక నిమజ్జనం, జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ఆమె జూపల్లికి సూచించారు.

English summary
AICC spokes person Manish Tiwari said on Monday in New Delhi that Telangana is very sensitive issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X