వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి నేతలతో చేయి కలిపిన చిన్నం! కాంగ్రెస్‌పై దాటవేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chinnam Ramakotaiah
విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు శాసనసభ్యుడు చెన్నం రామకోటయ్య మంగళవారం తెలుగుదేశం పార్టీ నేతలతో చేతులు కలిపారు. జిల్లాకు చెందిన టిడిపి నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు, తంగిరాల ప్రభాకర రావు, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇందిర బాట కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. నాగార్జున సాగర్ నుండి ప్రకాశం బ్యారేజికి నీటిని విడుదల చేసి కృష్ణా డెల్టా పరిధిలోని పంటలను కాపాడాలని కోరారు.

ఇరవై రోజులకు పైగా నీరు నిలిచిపోవడంతో డెల్టా ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. ఈ పరిస్థితిల్లో నాగార్జున సాగర్ నుండి నీటిని విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలని వినతిపత్రం సమర్పించారు. టిడిపి నేతల విజ్ఞప్తికి కిరణ్ సానుకూలంగా స్పందించారు. డెల్టాలో పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని చెప్పారు.

కాగా టిడిపి నేతలు కిరణ్‌ను కలిసిన సమయంలో అప్పుడే అక్కడకు నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య వచ్చారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. చిన్నంతో నేతలు కరచాలనం చేశారు. ఈ సందర్భంగా దేవినేని.. మీరు టిడిపిలోకి ఎప్పుడు వస్తున్నారని చిన్నంను ప్రశ్నించారు. అందుకు ఆయన తనపై సస్పెన్షన్ ఎత్తివేయిస్తే అప్పుడు చూస్తానని దేవినేనికి చెప్పారు. మీరు కాంగ్రెసులో ఎప్పుడు చేరుతున్నారని మీడియా ప్రశ్నించగా చిన్నం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు.

కాగా చిన్నం రామకోటయ్య ఇటీవల తెలుగుదేశం పార్టీ పైన, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తానులో పార్టీ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేయనని, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే పరిస్థితి కనిపించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కాంగ్రెసుతో చెట్టాపట్టాల్ వేస్తుండటంతో పార్టీ అతనిని బహిష్కరించింది.

English summary
Nuziveedu MLA Chinnam Ramakotaiah met Telugudesam party leaders at Gannavaram in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X