హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అస్వస్థతతో పరీక్షల మీద పరీక్షలు: శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స?

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilaxmi
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చంచల్‌గుడా మహిళా జైలులో ఉన్న ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చేట్లుందని అంటున్నారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) అక్రమ తవ్వకాల కేసులో శ్రీలక్ష్మి అరెస్టయిన విషయం తెలిసిందే. ఆమెకు త్వరలోనే శస్త్రచికిత్స జరగనున్నట్లు తెలుస్తోంది.

గత రెండు వారాలుగా శ్రీలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడవలేకపోవడం వంటి సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు మహిళా జైలు సూపరింటిండెంట్‌కు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.

శ్రీలక్ష్మికి వైద్యం చేస్తున్న ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్ సలహా మేరకు శ్రీలక్ష్మిని మంగళవారం నిజాం వైద్య విజ్ఞాన సంస్థకు (నిమ్స్‌కు) తీసుకుని వెళ్లారు. నిమ్స్‌లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఆమెకు శస్త్రచికిత్స అవసరం ఏర్పడవచ్చునని అంటున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి అక్రమ తవ్వకాల కేసులో అరెస్టయిన శ్రీలక్ష్మి జైలులో ముభావంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఒఎంసికి మేలు జరిగే విధంగా శ్రీలక్ష్మి జీవోలను జారీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆమెకు తొలుత బెయిల్ లభించినప్పటికీ ఆ తర్వాత రద్దయింది. దీంతో ఆమె జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

English summary
AS officer Y. Srilakshmi, who is in the Chanchalguda prison in connection with the Obulapuram mining scam, may have to undergo an operation soon, jail officials said. According to the Chanchalguda women’s jail superintendent, Ms Lakshmi had been complaining of ill health, body pain, shortness of breath and inability to walk for the past two weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X