హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మార్చ్ వాయిదాపై చేతులెత్తేసిన తెలంగాణ మంత్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Jana Reddy-Damodara Rajanarasimha
హైదరాబాద్: తెలంగాణ జెఎసి ఈ నెల 30వ తేదీన తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేయించే విషయంపై తెలంగాణ మంత్రులు చేతులెత్తేశారు. మార్చ్‌ను వాయిదా వేయించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పలువురు తెలంగాణ మంత్రులతో మాట్లాడారు. ముఖ్యంగా, సీనియర్ మంత్రి కె. జానారెడ్డిని అందుకు ప్రయత్నించాలని కోరారు. అయితే, జానారెడ్డి దాని కోసం తీవ్రంగా ప్రయత్నించిన దాఖలాలు కనిపించడం లేదు. పైగా, తాను మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని కోరబోనని చెప్పారు.

తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇప్పించాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులదేనని, పైగా మార్చ్‌లో తెలంగాణ మంత్రులు అగ్రభాగాన ఉండాలని తెలంగాణ జెఎసి అంటోంది. ఈ స్థితిలో తెలంగాణ మంత్రులు మార్చ్‌లో పాల్గొనడానికి సిద్ధంగా లేనప్పటికీ వాయిదా వేయించే విషయంలో మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి రహస్య మంతనాలు జరిపారు. మార్చ్‌కు జరిగి తీరుతుందని చెబుతున్న కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావుతో కూడా జానా రెడ్డి చర్చలు జరిపారు.

మార్చ్‌ను వాయిదా వేయించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులు సారయ్యను, శ్రీధర్ బాబును కూడా కోరినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఆ పనిచేయబోనని శ్రీధర్ బాబు పరోక్షంగా ముఖ్యమంత్రితో చెప్పినట్లు సమాచారం. హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రయత్నాలు కూడా ఏ మాత్రం ఫలించడం లేదు. అయితే, తెలంగాణ మంత్రులు తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేయించడానికి అంత సముఖంగా లేరని తెలుస్తోంది.

తెలంగాణ ప్రజలు ఇప్పటికే తమపై ఆగ్రహంగా ఉన్నారని, మార్చ్‌ను వాయిదా వేసుకోవాలంటే మరింతగా తమపై విరుచుకుపడతారని తెలంగాణ మంత్రులు భావిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రికి సహకరించడానికి వారు ఏ మాత్రం ఇష్టంగా లేరని అంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణ మార్చ్‌లో పాల్గొంటామని ఇది వరకే చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ మార్చ్‌ను నిర్వహించి తీరుతామని తెలంగాణ జెఎసి నాయకులు అంటున్నారు. నిజానికి, తెలంగాణ విషయంలోనే కాకుండా ముఖ్యమంత్రి ఏకపక్ష వ్యవహారశైలి పట్ల కూడా తెలంగాణ సీనియర్ మంత్రులు అసంతృప్తితో ఉన్నారు.

English summary
Minister from Telangana expressed their inability in postponement of Telangana march. They are not even appealing Telangana JAC to postpone the Telangana March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X